హాయ్ నాన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో థియేటర్లలో విడుదలవుతున్నాయి. నాని కెరీర్ కు హాయ్ నాన్న మూవీ సక్సెస్ సాధించడం కీలకం కాగా గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేని నితిన్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. హాయ్ నాన్న మూవీ 27 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.
ఈ రెండు సినిమాలు వేర్వేరుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కాయి. ఈ సినిమాలకు ఇప్పటికే బుకింగ్స్ మొదలు కాగా రెండు సినిమాలకు బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. హైదరాబాద్ లో ఫస్ట్ డే బుకింగ్స్ విషయంలో రెండు సినిమాల హవా కొనసాగుతోంది. టైర్2, టైర్3 సిటీలలో మాత్రం ఈ రెండు సినిమాల బుకింగ్స్ పుంజుకోవాల్సి ఉంది. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమాలు రిలీజవుతున్నాయి.
నాని, నితిన్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తుండటం (Hi Nanna) సినిమాలకు ప్లస్ అవుతోంది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యానిమల్ సినిమా ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుండగా ఈ సినిమాలు సైతం సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
సలార్ మూవీ ఈ నెల 22వ తేదీన రిలీజ్ కానుండగా క్రిస్మస్ సెలవులను ఈ సినిమా క్యాష్ చేసుకోవడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్1 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే సలార్2 మూవీకి సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సలార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్ మీడియాకు దూరంగా ఉండటంతో ఫ్యాన్స్ ఒకింత ఫీలవుతున్నారు. ఈ నెలలో మరో క్రేజీ మూవీ సలార్ కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.