Hidimba Collections: ‘హిడింబ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే..?

  • September 4, 2023 / 09:57 AM IST

ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ‘మిస్టర్ నూకయ్య’ వంటి డిఫరెంట్ మూవీని అందించిన దర్శకుడు అనిల్ కన్నెగంటి డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘హిడింబ’. ‘శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్’ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు. ‘హిడింబ’ ట్రైలర్ బాగుంది. సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేసింది. జూలై 20న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది.

కానీ వర్షాల వల్ల.. సినిమా సో సో గానే కలెక్ట్ చేసింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.87 cr
సీడెడ్ 0.41 cr
ఉత్తరాంధ్ర 0.25 cr
ఈస్ట్ 0.18 cr
వెస్ట్ 0.13 cr
గుంటూరు 0.16  cr
కృష్ణా 0.18 cr
నెల్లూరు 0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.26 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.34 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.60 cr (షేర్)

‘హిడింబ’ (Hidimba) చిత్రానికి రూ.2.56 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.2.6 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. రూ.40 లక్షల నష్టాలతో ఈ మూవీ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus