Hidimbha: హిడింబ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • July 21, 2023 / 08:34 PM IST

ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ‘మిస్టర్ నూకయ్య’ వంటి డిఫరెంట్ మూవీని అందించిన అనిల్ కన్నెగంటి డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘హిడింబ’. ‘శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్’ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు. జూలై 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

అశ్విన్ సినిమాలు చాలా వరకు థియేట్రికల్ పరంగా కమర్షియల్ సక్సెస్ సాధించాయి. దీంతో ఈ సినిమాకి బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 0.80 cr
సీడెడ్ 0.46 cr
ఆంధ్ర 1.00 cr
ఏపీ + తెలంగాణ 2.26 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.56 cr

‘హిడింబ’ (Hidimbha) చిత్రానికి రూ.2.56 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే ఆ టార్గెట్ ను రీచ్ అవ్వడం ఈజీనే. పైగా టీజర్, ట్రైలర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాకి బజ్ బాగానే క్రియేట్ అయ్యింది కానీ మరోపక్క ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలు కొంత టెన్షన్ పెడుతున్నాయి అని చెప్పాలి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus