మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్నునుంచి వచ్చేవి మాటలు కాదు. గారెలు. ఎంత తిన్నాతినాల నిపిస్తాయి. అందుకే ఆయన మాటల కోసమే సినిమాకు పోయే వాళ్లు చాలా మందే ఉన్నారు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన “అ..ఆ” లోనూ పదునైన పంచ్ లకు కొదవలేదు. ఈ సారి మహిళలను టార్గెట్ చేసి పేల్చిన మాటల మతాబులు.. థియేటర్ల నిండా చప్పట్ల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ డైలాగ్ లను అమ్మాయిలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. అవేంటో ఓ సారి.. మీరు చదివి రుచి చూడండి.