బ్రహ్మోత్సవం… హైలైట్ సీన్స్…!

ప్రిన్స్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటిస్తున్న భారీ చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమ్ాఆపి రోజు రోజుకీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఫాన్స్ అయితే ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధిస్తుందో అన్న లెక్కల్లో మునిగితేలుతున్నారు. ఇదిలా ఉంటే గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా గురించి సినిమాలో నటించిన వారందరు సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అదే క్రమంలో ఈ సినిమా హైలైట్స్ సీన్స్ గురించి కూడా లీక్స్ చేసేస్తున్నారు.

ఇంతకీ సినిమాలో హైలైట్స్ ఏంటి అంటే…ఆడియో రిలీజ్ నాడు జయసుధ మాట్లాడుతూ సినిమా క్లైమాక్స్ లో మహేష్ అద్భుతంగా చేసి ఏడిపించాడని చెప్పేశారు, అంటే దీన్ని బట్టి చూస్తే సినిమాలో సెంటిమెంట్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి అని తెలిసిపోతుంది. అదే క్రమంలో ఈ చిత్రానికి కెమెరామన్ గా చేస్తున్న రత్నవేలు మీడియాకు ఇచ్చిన ఇంటెర్వ్యు లో ఈ సినిమా ఇంటేర్వెల్ సీన్ దుమ్ము దులిపేస్తుంది అని ఇప్పటికే చెప్పేసాడు. సో ఈ లెక్కన చూసుకుంటే బ్రహ్మోత్సవం సినిమాకు ఇంటర్వల్, క్లైమాక్స్ రెండు చాలా ప్రాముఖ్యం అని చెప్పొచ్చు. మరి ఆ రెండింటికి పదునైన కధ తోడైతే, ఇంకేముంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిపోయినట్లే. మరో పక్క మహేష్ కూడా సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. సమంత, కాజల్ కూడా బ్రహ్మోత్సవం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అన్ని వెరసి బ్రహ్మోత్సవం భారీ హిట్ సాధించాలని కోరుకుందాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus