తెలుగు సినిమాల పరిధి విస్తరించింది. ఇతర దేశాల వారు మన చిత్రాలను ఆదరించడమే కాదు.. సినిమా నిర్మాణంలో భాగం పంచుకోవడానికి సంతోషపడుతున్నారు. వారికి సరైన రెమ్యునరేషన్ ఇచ్చి గౌరవించడంలో మన నిర్మాతలు వెనుకాడడం లేదు. ఈ మధ్య తెలుగు సినిమాలకు పనిచేసే హాలీవుడ్ టెక్నీషియన్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ సినిమాకు హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ పనిచేస్తున్నారు. ఇతను ఎన్టీఆర్ ని సరికొత్తగా చూపించడానికి కష్టపడుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ ‘ఎల్ఐఈ (లై) అనే సినిమా చేస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఇందులో హాలీవుడ్ నటుడు డాన్ బిల్జీరియన్ కీలక రోల్ పోషిస్తున్నారు.
ఇక ప్రభాస్ సాహో మూవీకి మిషన్ ఇంపాజిబుల్ వంటి అనేక హిట్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేయనున్నారు. అలాగే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ చేస్తున్న సినిమాకి బల్గేరియాకి చెందిన నిక్కీ కెమెరా టీమ్ లో సేవలందిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరక్టర్ బాబ్ బ్రౌన్ అఖిల్ కోసం వినూత్న యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బాబ్ బ్రౌన్ ఆధ్వర్యంలో మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ఫైట్ షూట్ చేశారు. ఈ విధంగా హాలీవుడ్ టెక్నీషన్లు తెలుగు చిత్రాల రేంజ్ పెంచుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.