Pathaan: ‘పఠాన్‌’కు 32 ఏళ్ల తర్వాత హౌస్‌ఫుల్ బోర్డ్‌.. ఇంకా ఎన్నో రికార్డులు!

  • January 28, 2023 / 08:29 PM IST

బాలీవుడ్ ఆకలి తీర్చడానికి షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ రూపంలో వస్తున్నాడు. వచ్చాక గత రికార్డులు నామరూపాలు లేకుండా పోతాయి అని అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అలా అనుకున్నవాళ్ల ఆశలను వమ్ము చేయకుండా షారుఖ్‌ ఖాన్‌ గట్టి సినిమానే డెలివర్‌ చేశాడు. ఇప్పుడు ఆ ఫలితాలు ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఏంటిది సినిమా విడుదలై మూడు రోజులకే ఇంతగా చెబుతున్నారు అంటారా? సినిమా వసూళ్ల లెక్కలు అలా ఉన్నాయి మరి. షారుఖ్‌ ఖాన్, దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహమ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘పఠాన్‌’ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు.

ఈ సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే రోజుకు వంద కోట్లు అన్నమాట. ఒక బాలీవుడ్‌ సినిమా వారంలో వంద కోట్లు సంపాదించడం అంటే గగనం అనుకుంటున్న ఈ రోజుల్లో ఓ సినిమా రోజుకు రూ. వంద కోట్లు వసూలు చేస్తుందంటే ఈ విజయం ఎంత భారీగా ఉందో చెప్పొచ్చు. వసూళ్లతోపాటు ఈ సినిమా ఘనత కూడా సాధించింది. కశ్మీర్‌ లోయలోని ఓ థియేటర్‌ బయట ఈ సినిమా కోసం హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టారట.

అందులో విశేషం ఏముందంటారా?. కశ్మీర్‌లో ఓ థియేటర్‌లో హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టి 32 ఏళ్లు అయ్యిందట. కశ్మీర్‌ లోయలోని ఆ థియేటర్‌ సంగతి చూస్తే.. అక్కడి ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌లో ‘పఠాన్‌’ షోస్‌కి తొలి రోజు నుండి ఆదరణ బాగుందట. ఈ క్రమంలో ఫస్ట్‌ డే హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టారట. దీనికి సంబంధించిన ఫొటోను ఐనాక్స్‌ టీమ్‌ ట్వీట్‌ చేసింది. కశ్మీర్‌లో భద్రతపరమైన పరిస్థితుల నేపథ్యంలో చాలా కాలంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు.

ఇటీవల పరిస్థితులు మెరుగుపడ్డాయి. దానికితోడు షారుఖ్‌ సినిమా వచ్చింది. దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా.. ఇవన్నీ కలిసి థియేటర్‌ ముందు 32 ఏళ్ల తర్వాత హౌస్‌ఫుల్ బోర్డు పడింది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus