Sreeleela: శ్రీలీలని సంప్రదించకుండా ఆ సినిమాలో సెలెక్ట్ అయిపోయిందట?

  • March 2, 2023 / 01:58 PM IST

కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెళ్ళిసందD’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన ఈ మూవీ.. 2021 దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. మొదట ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినా… ముందు నుండి పాటలు హిట్ అవ్వడం, హీరోయిన్ శ్రీలీల లుక్స్ కు సూపర్ రెస్పాన్స్ లభించడంతో యూత్ ఈ చిత్రం చూడడానికి ఎగబడ్డారు.

అందువల్ల కొన్ని బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా కొన్ని సెంటర్స్ లో ఈ మూవీ 50 రోజులు కూడా ప్రదర్శింపబడింది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా శ్రీలీలకి చెందడంతో.. వెంటనే ఆమెకు రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ధమాకా’ లో ఛాన్స్ దక్కింది. ఆ సినిమా కూడా యావరేజ్ టాక్ తోనే డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా సక్సెస్ లో కూడా శ్రీలీలకి మేజర్ క్రెడిట్ దక్కింది.

దీంతో ఈమెకు మహేష్ బాబు – త్రివిక్రమ్ ల సినిమాలోనూ అలాగే బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమాలోనూ అవకాశాలు దక్కాయి. ‘వినోదయ సీతమ్’ రీమేక్ లో ఓ స్పెషల్ సాంగ్ కు దాదాపు ఈమె ఫైనల్ అయ్యింది. ‘ధమాకా’ నిర్మాతలు రూపొందించే సినిమా కావడంతో ఆమె ఎస్ చెప్పింది. ఇది కాక రామ్ – బోయపాటి సినిమాలో కూడా నటిస్తుంది.

ఇవి కాకుండా ఇప్పటివరకు ఆమె మరో సినిమాలో నటించింది లేదు. అయితే విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ , చరణ్ – బుచ్చిబాబు కాంబో మూవీలో ఈమె హీరోయిన్ గా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు అని టాక్.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus