బిగ్‌బాస్‌ 4: ఆ ముగ్గురికీ టిప్‌ ఇవ్వలేదా? ఎందుకోమరి!

  • October 9, 2020 / 12:00 PM IST

బిగ్‌బాస్‌ కెప్టెన్సీ పార్టిసిపెంట్స్‌ ఎంపిక చేయడానికి బిగ్‌బాస్‌ ‘బిబి గ్రాండ్‌ హోటల్‌’ అనే టాస్క్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో గెస్ట్‌ టీమ్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే హోటల్‌ సిబ్బంది నుంచి కూడా ఒకరిని కెప్టెన్సీ టాస్క్‌ కోసం ఎంపిక చేశారు. అయితే హోటల్‌ సిబ్బందిలో ఎక్కువ టిప్‌ సంపాదించిన వారికి ఆ అవకాశం ఇచ్చాడు. అందులో అఖిల్‌ ఎక్కువ టిప్‌ సంపాదించి కెప్టెన్సీ టాస్క్‌లోకి వెళ్లాడు. మిగిలినవారు ఎంతెంత సంపాదించారో చూద్దాం

బిబి గ్రాండ్‌ హోటల్‌లో మంచి సేవలు అందించి టిప్స్‌ సంపాదించండి అని బిగ్‌బాస్‌ చెప్పాడు. అయితే కొంతమంది సరైన సేవలు అందించలేదు. దీంతో సరైన టిప్‌ అందుకోలేకపోయారు. వంట వండటానికి సిద్ధపడని అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌కు 500 మాత్రమే టిప్‌ వచ్చింది. స్పాలో ఉన్న మోనాల్‌ 2500 సంపాదించింది. ఇక చెఫ్‌గా చేసిన సుజాత 3000 సంపాదించగా, మెయింటెనెన్స్‌లో ఉన్న నోయల్‌ 3500 సాధించారు. అసిస్టెంట్‌ మేనేజర్‌గా చేస్తూ సీక్రెట్‌ టాస్క్‌ చేసి అవినాష్‌కు 4000 టిప్‌ వచ్చింది. అభిజీత్‌కు 4500 టిప్‌ వచ్చినా వాటిని కోపంతో హారిక చించేసింది. దీంతో వాటిని బిగ్‌బాస్‌ పరిగణించాడో లేదో తెలియదు.

సెక్యూరిటీగా పని చేసి అఖిల్‌ 11,500 సంపాదించి అందరిలోనూ ఎక్కువ సంపాదించిన హౌస్‌మేట్‌గా నిలిచాడు. పోటీలోకి వచ్చాడు. ఇంట్లోవాళ్లందరూ టాస్క్‌ ఆడటానికి అంటే హోటల్‌ను రన్‌ చేయడానికి సిద్ధపడకపోయినా అఖిల్‌ మాత్రం సెక్యూరిటీ పనిని సక్రమంగా చూసుకున్నాడు. అందుకే గెస్ట్‌లు ఎక్కువ టిప్‌ ఇచ్చారు. అయితే సోహైల్‌, మెహబూబ్‌కి అఖిల్‌ మంచి దోస్త్‌ కావడంతో కావాలనే అతనికే టిప్‌ ఎక్కువ ఇచ్చారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

ఇక్కడివరకు అంతా బాగుంది. కానీ ఎవరెంత టిప్స్‌ సంపాదించారనే లెక్కలో కొంతమంది పేర్లు వినిపించలేదు. అంటే వారికి టిప్స్‌ రాలేదా? లేక బిగ్‌బాస్‌ చూపించలేదో తెలియడం లేదు. టిప్స్‌ లెక్క చెప్పనివారిలో లాస్య, దివి, కుమార్‌ సాయి ఉన్నారు. వీరిలో లాస్య ఎంతో కష్టపడి వంట చేసింది, దివి స్పాలో ఉండింది. మరి వారికి టిప్‌ వచ్చిందో లేదో తెలియలేదు. ఇక కుమార్‌ సాయి విషయానికొస్తే ఆయన టాస్క్‌లో ఎక్కడా కనిపించలేదు. కాబట్టి ఆయనకు టిప్‌ రాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus