మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmita Konidela) , కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించిన తర్వాత, ఇప్పుడు నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. తన తండ్రి చిరంజీవి హీరోగా, దర్శకుడు అనీల్ రావిపూడి (Anil Ravipudi) రూపొందిస్తున్న సినిమాతో సుస్మిత నిర్మాతగా మొదటి అడుగు వేస్తోంది. ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఈ సంస్థ ద్వారా సుస్మిత భాగస్వామిత్వంతో కొన్ని ఓటీటీ వెబ్ సిరీస్‌లను నిర్మించినప్పటికీ, సినిమా నిర్మాణంలోకి రావడం ఇదే తొలిసారి.
ఈ సినిమా చిరంజీవికి 157వ చిత్రంగా నిలవనుంది, దీన్ని సుస్మితతో కలిసి సాహుగారపాటి కూడా నిర్మిస్తున్నారు. సినిమా నిర్మాణంలో ఇద్దరు భాగస్వాములు ఉండటంతో, చిరంజీవి రెమ్యునరేషన్ విషయంలో ఆసక్తి నెలకొంది. సుస్మిత ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా వ్యవహరిస్తున్నట్లు సమాచారం, దీని వల్ల నిర్మాణ ఖర్చుల్లో డిజైనర్ రెమ్యునరేషన్ ఆదా అవుతుంది. అయితే, చిరంజీవి రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని, మార్కెట్ లెక్కల ప్రకారం చెల్లించాల్సిందేనని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
చిరంజీవి ఇటీవల ఒకే చేసిన సినిమాలకు 50 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకున్నారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి అంతకంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, సుస్మిత నిర్మాణంలో ఉన్న ఈ సినిమాకు ఆయన ఎంత తీసుకుంటారనేది ఇంకా స్పష్టత లేదు. కొన్ని వర్గాల ప్రకారం, ఈ సినిమాకు అడ్వాన్స్‌గా సుస్మిత, సాహుగారపాటి (Sahu Garapati) కలిసి కొంత మొత్తం చెల్లించి, మిగిలినది చిత్రీకరణ తర్వాత చెల్లించే అవకాశం ఉంది.
గతంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ‘ఖైదీ నెం.150’ (Khaidi No. 150), ‘సైరా నరసింహ రెడ్డి’ (Sye Raa Narasimha Reddy ), ‘విశ్వంభర’ (Vishwambhara) వంటి సినిమాలకు పనిచేసిన సుస్మిత, నిర్మాణ సంస్థల నుంచి రెమ్యునరేషన్ అందుకుంది. ఇప్పుడు ఆమె నిర్మాతగా మారి, తండ్రికి రెమ్యునరేషన్ చెల్లించే స్థాయికి ఎదిగింది. 2023లో సుస్మిత నిర్మించిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ (Sridevi Shoban Babu) విజయం సాధించలేదు, కానీ ఈసారి తండ్రి సినిమాతో ఆమె భారీ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుందని, చిరంజీవి ఈ ప్రాజెక్ట్ కోసం తన మార్కెట్ రేట్ ప్రకారం రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం.