ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యశ్ హీరోగా తెరకెక్కిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2018 డిసెంబర్ 21న విడుదలైన ఈ చిత్రం బాహుబలి తరువాత పాన్ ఇండియన్ స్థాయిలో హిట్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో ఈ చిత్రాన్ని కేవలం రూ.5కోట్లకు కొనుగోలు చేశారు. నిజానికి ఓ కన్నడ చిత్రానికి ఇది కూడా పెద్ద బిజినెస్ అనే చెప్పాలి. అయితే ఆ చిత్రం పెద్ద హిట్ అవ్వడం.. ఏకంగా రూ.10కోట్ల పైనే షేర్ ను వసూల్ చెయ్యడంతో ‘కె.జి.ఎఫ్2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే కె.జి.ఎఫ్2 చిత్రీకరణ సమయంలో.. తెలుగు రైట్స్ కు ఏకంగా రూ.35 కోట్ల వరకూ డిమాండ్ చేశారట ఆ చిత్రం నిర్మాతలు. అయితే ఇటీవల విడుదలైన ‘కె.జి.ఎఫ్’ టీజర్ సంచలనాలు సృష్టించింది. ఈ టీజర్ కు ఏకంగా 150 మిలియన్ వ్యూస్ నమోదవ్వడంతో ‘కె.జి.ఎఫ్2’ పై మరింత హైప్ ఏర్పడింది. దాంతో గతంలో ‘కె.జి.ఎఫ్2’ నిర్మాతలు డిమాండ్ చేసినంత రూ.35కోట్లు చెల్లిస్తామని తెలుగు డిస్ట్రిబ్యూటర్ ముందుకు వచ్చారట.
కానీ ఇప్పుడు ‘కె.జి.ఎఫ్2’ నిర్మాత ఏకంగా రూ.50కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారని టాక్. అది కేవలం థియేట్రికల్ రైట్స్ వరకే డిమాండ్ చేస్తున్నారా లేక డిజిటల్ రైట్స్ కూడా కలుపుకుని అంత మొత్తం డిమాండ్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఫైనల్ గా ఈ డీల్ రూ.40కోట్లకు అయితే ఫైనల్ చెయ్యాలని తెలుగు డిస్ట్రిబ్యూటర్ ఆలోచనలో ఉన్నట్టు టాక్. మరి చివరికి ఏమవుతుందో చూడాలి.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!