Honey Rose: బాలయ్య బ్యూటీ డిమాండ్ మాములుగా లేదుగా!

  • February 6, 2023 / 06:39 PM IST

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘వీరసింహారెడ్డి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది నటి హనీరోజ్. అప్పటివరకు ఈ బ్యూటీ గురించి మనవాళ్లకు పెద్దగా తెలియదు. కానీ బాలయ్య సరసన ఆమె పెర్ఫార్మన్స్ చూసి ఫిదా అయిపోయారు. తెరపై చాలా అందంగా కూడా కనిపించింది. మలయాళంలో ఎన్నో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో ఒక్క సినిమాతోనే ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. యూత్ లో ఆమెకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రీసెంట్ గా ఆమె ఒక షోరూం ఓపెనింగ్ కు వెళ్లింది.

ఆమె వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి రావడం మాములు విషయమే. కానీ హనీరోజ్ ని చూసేందుకు సదరు షోరూం పక్కనున్న జిల్లాల నుంచి కూడా బస్సుల్లో భారీగా జనాలు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. జనాల్లో హనీరోజ్ కి ఉన్న ఫాలోయింగ్ చూసిన వారంతా కూడా షాక్ అవుతున్నారు. ఆమె కోసం భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ.. లెక్కలేనంత మంది జనాలు రావడం చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారట.

షోరూంకి వచ్చిన ఆమెని జాగ్రత్తగా తిరిగి ఇంటికి పంపించడానికి పోలీసులు, బౌన్సర్లు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సెల్ఫీల కోసం ఎగబడిన జనాలను బౌన్సర్లు ఆపలేకపోయారు. కొందరు ఆమె మీద పడిపోయే పరిస్థితి. ఫైనల్ గా ఎలాగోలా.. ఆమెని కారు ఎక్కించి ఇంటికి పంపించేశారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ తో జనాల్లో హనీరోజ్ క్రేజ్ ఏంటో అర్ధమవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో హనీరోజ్ ని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోల సరసన ఆమెకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయట.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus