Devatha Serial: ఐస్ క్రీమరీ స్టోర్‌ ఓపెనింగ్లో సందడి చేసిన ‘దేవత’ సీరియల్ హీరో, హీరోయిన్లు.. ఫోటోలు వైరల్!

  • April 15, 2023 / 01:39 PM IST

‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అయిన ‘దేవత’ సీరియల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సీరియల్ లో రుక్మిణి, రాధా పాత్రలతో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఓ రేంజ్లో క్రేజ్ ను సంపాదించుకుంది సుహాసిని. గతంలో ఈమె ‘చంటిగాడు’ వంటి హిట్ సినిమాల్లో నటించినా.. అక్కడ క్లిక్ అవ్వలేకపోయింది. కానీ సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయ్యింది. ‘దేవత’ సీరియల్ తో అయితే బుల్లితెర పై పెద్ద స్టార్ అయిపోయింది అని చెప్పాలి.

ఇక ఈమె భర్తగా చేసిన అంబటి అర్జున్ కూడా బాగా పాపులర్ అయ్యాడు.ఇతను మెల్ల మెల్లగా సినిమాల్లో కూడా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. ఇక ‘దేవత’ సీరియల్ జంట తాజాగా ఓ ఐస్ క్రీమరీ స్టోర్ ఓపెనింగ్ లో సందడి చేశారు. అయితే ఈ జంటని చూడటానికి స్థానికులు ఎగబడ్డారు. సీరియల్ నటీనటులకు ఇంత క్రేజా అని అంతా ఆశ్చర్యపోయారు. పూర్తివివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లోని తెల్లపూర్ లో డుమాంట్ ఐస్‌క్రీమ్ స్టోర్‌.. సుహాసిని, అర్జున్ ల చేతుల మీదుగా ప్రారంభమైంది. డుమాంట్ అనేది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ అంతటా 39 అవుట్‌లెట్‌లతో ఐస్ క్రీమ్ మార్కెట్‌లో ఉందని తెలుస్తుంది. మరికొన్ని ఔట్ లెట్స్ కూడా ఈ సంస్థ ప్రారంభించనుంది అని తెలుస్తుంది.

ఇక సుహాసిని, అర్జున్ లతో పాటు (Devatha Serial) ‘దేవత’ సీరియల్ లో వీళ్ళ కూతురిగా చేసిన పాప అలాగే ‘కార్తీక దీపం’ సీరియల్ లో సౌర్యగా చేసే పాప కృతిక కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus