బాక్సాఫీస్ పై బుడ్డోడి ప్రతాపం..!

రుడ్యార్డ్ కిల్పింగ్ నవలల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది జంగల్ బుక్’. ఐరన్ మాన్ ఫేమ్ జాన్ ఫెవరూ ఈ చిత్రానికి డైరెక్టర్ గా వ్యవహరించారు. అడ్వెంచర్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 15 న విడుదల అవుతున్న ఈ చిత్రం భారత్ లో మాత్రం ఒకవారం ముందుగానే విడుదల అయ్యింది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.55.14 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్ చిత్రాల వాణిజ్య విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్  పేర్కొన్నాడు. బాక్సాఫీస్ వద్ద చిత్ర కలెక్షన్లు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపాడు. డిస్నీ పిక్చర్స్ వారు రూపొందించిన ఈ చిత్ర హిందీ వర్షన్ కు ప్రియాంక చోప్రా, ఇర్ఫాన్, నానా పటేకర్, షేఫాలి షా, ఓంపురిలు వాయిస్ ఓవర్ అందించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus