రాధేశ్యామ్ తో రెచ్చిపోతున్న ప్రభాస్..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా గ్లింప్స్ ని విడుదల చేస్తామని రాధేశ్యామ్ టీమ్ ఎనౌన్స్ చేసిన దగ్గర్నుంచీ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు, ప్రభాస్ ని లవర్ బాయ్ గా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆశగా ఉన్నారు. ఈ టైమ్ లో రాధేశ్యామ్ బిజినెస్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది. ప్రస్తుతం సినిమా ఆలస్యమైనా సరే రేటు మాత్రం సూపర్ డూపర్ గా పలుకుతోందని టాక్. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ మళ్లీ ప్రభాస్ సినిమాతో పుంజుకుంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఓవర్సీస్ మార్కెట్ చాలా డల్ గా ఉన్న నేపథ్యంలో రాధేశ్యామ్ సినిమా మంచి ఊపు తెస్తుందని నమ్మకంగా చెప్తున్నారు. దాదాపు 22కోట్లకి పైగా సినిమాని గ్రేట్ ఇండియన్ ఫిల్మిం వాళ్లు సొంతం చేస్కోబోతున్నట్లుగా టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది.

ఓవర్సీస్ మార్కెట్ గురించి పక్కనబెడితే, బాలీవుడ్ లో మాత్రం ఈ బొమ్మ దిమ్మతిరిగేలా మార్కెట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. లవ్ బేస్డ్ మూవీ అవ్వడం, ఇందులో పూజాహెగ్డే, ఇంకా భాగ్యశ్రీలు ఉండటం అనేది బీ టౌన్ లో మార్కెట్ ని మంచి ఊపు తెస్తోంది. ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ రేటు పలికే ఛాన్స్ ఉంది. ఇక దీనిని మించి బాలీవుడ్ లో రేటు పలుకుతుందని, ఖాన్ హీరోల సినిమాలు ఇలాగే లవ్ స్టోరీలు సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయి కాబట్టీ ఈసారి ప్రభాస్ మార్కెట్ ని గట్టిగానే కొడతాడని అంటున్నారు.

కానీ, ఈ సినిమా ట్రిబుల్ ఆర్ సినిమాకి పోటీగా వస్తే కాస్త డల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి మేకర్స్ ట్రిబుల్ ఆర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా విడుదల తేదిని ఖరారు చేసే అవకాశం ఉంది. లాస్ట్ టైమ్ సాహో సినిమాతో బాలీవుడ్ లో భారీ వసూళ్లు రాబట్టిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ తో బాలీవుడ్ కలెక్షన్ కింగ్ గా మారబోతున్నాడని టాక్. ఎంత రేటైనా సరే కొనేందుకు బాలీవుడ్ లో పోటీపడుతున్నారట. సినిమా ఎప్పుడు రిలీజ్ అన్నది టీజర్ లో చెప్తే గనక ఈ మార్కెట్ ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus