‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ హీరోయిన్ కు పెరిగిన డిమాండ్..!

  • December 3, 2020 / 04:48 PM IST

వర్ష బొల్లమ.. మొన్నటివరకూ ఈ పేరు పెద్దగా ఎవ్వరికీ తెలీదు. అయితే ఇటీవల విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రంతో మాత్రం ఈమె బాగా పాపులర్ అయ్యింది. అమెజాన్ లో విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సంధ్య అనే పాత్రలో పక్కింటి అమ్మాయి మాదిరిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది వర్ష. నిజంగా ఈమె తెలుగమ్మాయే అని చెప్పినా.. అంతా నమ్మేస్తారు. అంత సహజంగా నటించింది వర్ష.

అయితే అందరూ ఈమె మొదటి చిత్రం ఇదే అనుకుంటున్నారు. అలా అనుకుంటే పొరపాటే..! నిజానికి వర్ష గతేడాది విడుదలైన ‘విజిల్'(తమిళ్ లో ‘బిగిల్’) చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అంతేకాదు ఈ ఏడాది విడుదలైన ‘చూసి చూడంగానే’ చిత్రంలో హీరోయిన్ గా నటించగా, ‘జాను’ చిత్రంలో ప్రభ అనే పాత్రలో కనిపించింది. ఆ చిత్రాలు పెద్దగా ఆడలేదు కాబట్టి వర్షను ఎవ్వరూ కాన్సన్ట్రేట్ చెయ్యలేదు అని చెప్పొచ్చు. అయితే ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

అంతేకాదు ఈమెను బిజీ హీరోయిన్ గా కూడా మార్చేస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం వర్ష.. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది వర్ష. అంతేకాకుండా ఈమెకు టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు కూడా చాలా వస్తున్నాయట. అలా అని ఈమె కంగారు పడి అన్నిటికీ ఓకే చెప్పడం లేదు, తనకు మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలనే ఎంపికచేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus