తారక్ ని ఇరకాటంలో పెట్టేశాడా..?

  • November 17, 2020 / 06:50 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన తదుపరి సినిమా దర్శకుడు త్రివిక్రమ్ తో చేయాలనుకుంటున్నాడు. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చేసింది. కానీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి అప్పటివరకు వెయిట్ చేయలేక త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. స్టార్ హీరోతో సినిమా అంటే ఎన్టీఆర్ అభ్యంతరం చెబుతున్నాడని.. ఓ మిడిల్ రేంజ్ హీరోతో సినిమా చేయాలనుకున్నాడు.

అయితే ఇప్పుడు ఆ ఆలోచనలన్నీ త్రివిక్రమ్ పక్కన పెట్టేసినట్లు సమాచారం. మార్చి నుండి తాను ఖచ్చితంగా అందుబాటులో ఉంటానని.. ఎన్టీఆర్ చెప్పడంతో త్రివిక్రమ్ తన ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాడు. అంతేకాకుండా.. ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముమ్మరం చేస్తున్నాడు. తద్వారా ఎన్టీఆర్ పై త్రివిక్రమ్ ఒత్తిడి పెంచుతున్నాడట. ఎందుకంటే ఇప్పుడు సినిమా పనులు మొదలుపెట్టిన తరువాత ఎన్టీఆర్ కచ్చితంగా మార్చి నుండి షూటింగ్ లో పాల్గొనాలి.

కానీ రాజమౌళి తనను ఎప్పుడు వదులుతారో ఎన్టీఆర్ కి క్లారిటీ లేదు. మరి ఈ విషయంలో తారక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరోపక్క త్రివిక్రమ్ తన సినిమాకి సంబంధించిన పనులు మొదలుపెట్టడంతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ చేస్తోన్న సినిమాకి మాటలు అందిస్తారనే ప్రచారం జరుగుతోంది!

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus