భారీ ధర పలికిన బహుబలి కంక్లూజన్ నెల్లూరు థియేటర్స్ హక్కులు

  • February 14, 2017 / 12:45 PM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అపూర్వ సృష్టి “బాహుబలి : బిగినింగ్” సినిమా 600 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులను నెలకొల్పగా… ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఔరా అనిపించింది.  నైజాం(తెలంగాణ)  ఏరియా హక్కులు 50 కోట్లకు, సీడెడ్ (రాయల సీమ) థియేటర్ హక్కులు 27 కోట్లకు అమ్ముడు పోయి వార్తలో నిలిచిన ఈ మూవీ ప్రస్తుతం ఒక్క నెల్లూరు జిల్లా హక్కులు 5 .6  కోట్లు పలికి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. ఇప్పటివరకు ఏ మూవీ ఇంత ధర పలకలేదు. ఎందుకంటే అక్కడ స్టార్ హీరోల సినిమాలు సైతం 4 కోట్ల కంటే ఎక్కువగా వసూళ్లు రాబట్టలేదు.

చిరంజీవి తాజా చిత్రం ఖైదీ నంబర్ 150 మూవీ కూడా 3 .30 కోట్లు రాబట్టింది. బాహుబలి బిగినింగ్ మాత్రమే 4 .5 కోట్లతో నెల్లూరులో అత్యధిక కలక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు బాహుబలి 2 హక్కులను  5 .6  కోట్లు చెల్లించి డిస్ట్రిబ్యూటర్లు సొంతం చేసుకున్నారు. నష్టం రాకుండా ఉండాలంటే పంపిణీదారులు 6 కోట్లు రావాల్సి ఉంటుంది. 5 కోట్ల సామర్థ్యం కలిగిన ఈ జిల్లాలో బాహుబలి కంక్లూజన్ 6  కోట్లకు పైగా కలక్షన్స్ తీసుకురాగలుగుతుందా? అని అందరూ చర్చించుకుంటున్నారు. ఫలితం ఎలా ఉండబోతోందో తెలియాలంటే రెండు నెలలు ఆగాల్సి ఉంటుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus