మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్150 సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో తన స్థానం పదిలమని నిరూపించుకున్నారు. మాస్ డైరక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ జనవరి 11 న రిలీజ్ అయి కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. వేగంగా వంద కోట్ల క్లబ్ లో చేరి మెగా సత్తా చాటింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 55 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్లందరికీ లాభాలను అందించింది. అయితే ఈ మూవీకి చిరు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు? అనే విషయం మొదటి నుంచి సస్పెన్స్ గానే ఉంది.
సినిమా సక్సస్ కావడంతో ఇప్పుడు ఆ విషయం రివీల్ అయింది. లాభాల్లో చిరుకి 60 శాతం వాటా ఇవ్వాలని ముందుగానే అనుకున్నారంట. అదే విధంగా ఇప్పుడు చెర్రీ సెటిల్ చేసినట్లు తెలిసింది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ద్వారా 110 కోట్లను రాబట్టింది. ఇందులో బడ్జెట్ 55 కోట్లు పోగా మిగిలిన 55 కోట్లలో 60 శాతాన్ని అంటే 33 కోట్లను చిరుకి ఇచ్చినట్లు, చరణ్ కి 22 కోట్లు మిగిలినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక సినిమాకు 33 కోట్లు తీసుకొని చిరు రెమ్యునరేషన్ పరంగా ఇప్పటికీ నంబర్ వన్ హీరో అని చాటారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.