కోట్లు కురిపిస్తున్న పవన్ త్రివిక్రం కాంబినేషన్
- June 7, 2017 / 01:17 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కల్యాణ్…ఈ పేరు వింటేనే ఆయన ఫ్యాన్స్ అభిమానంతో ఊగిపోతారు. ఇక ఆయన తెరపై కనిపిస్తే చాలు రికార్డులు వాటంతట అవే ఆయన్ని ఫాలో అవుతూ వచ్చేస్తాయి. మరి అలాంటి పవన్ కల్యాణ్ కొత్త సినిమా విషయం గురించి చెబితే ఆయన ఫాన్స్ కి పండగే గా…అసలు విషయం ఏంటి అంటే టాలీవుడ్ నుంచి సౌత్ వరకూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చేప్పసిన పనిలేదు. అయితే టాలీవుడ్ లో హయ్యెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ సినిమా ఫలితాలు ఎలా ఉన్నా సరే కొత్త సినిమా అంటే ఆ మూవీకి వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలి అంటే సినిమా ఫ్లాప్ అయినా బయ్యర్స్ అంత సేఫ్ జోన్ లో ఉంటారు అంటే నమ్మక తప్పని నిజం. ఇక రీసెంట్ గా కాటమరాయుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు.
ఇక సినిమాలో పవర్ స్టార్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం. అయితే ఈ సినిమా తాజాగా మొదలయ్యినప్పటికీ, ఇంకా సగం కూడా పూర్తి కాకపోయినప్పటికీ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారి టాలీవుడ్ సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తుంది. దాదాపు 100 కోట్లు టచ్ చేసేలా పవన్ మూవీ థియేట్రికల్ రైట్స్ ఉన్నాయన్న వార్తలు ఇప్పుడుసంచలనం సృష్టిస్తున్నాయి. అంతేగామరి ఒక పక్క పవర్ స్టార్, మరో పక్క మాటల మాంత్రికుడు ఈ ఇద్దరు కలిస్తే బిజినెస్ దుమ్ము రేగాల్సిందే మరి. ఏది ఏమైనా….ప్రే రిలీజ్ బిజినెస్ నే ఈ రేంజ్ లో ఉంటే, ఇక సినిమా రిలీజ్ తరువాత బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















