ప్రభాస్-పూజ రొమాన్స్ కోసం మరో రెండు భారీ సెట్స్

ప్రభాస్ లేటెస్ట్ మూవీ షెడ్యూల్ ఈ మధ్యనే మొదలైంది. యూరప్ నేపథ్యంలో నడిచే పీరియడ్ లవ్ డ్రామా కావడంతో ఈ చిత్రం కొరకు భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం కొరకు నిర్మాతలు మరో రెండు భారీ సెట్స్ నిర్మిస్తున్నారట. ఒకటి పెద్ద బోట్ సెట్ తో పాటు మరో ఓ లేక్ సెట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న క్రమంలో ప్రభాస్ మరియు ఆమెపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం.

ఇక ప్రభాస్ కి పాన్ ఇండియా ఇమేజ్ ఏర్పడిన తరుణంలో ఈ చిత్రాన్ని కూడా తెలుగుతో పాటు హిందీ మరియు తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ నుండి వెటరన్ హీరో మిథున్ చక్రవర్తి, హీరోయిన్ భాగ్యశ్రీ కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతుండగా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి గతంలో జాన్ టైటిల్ అనుకున్నారు. ఇక ఎప్పుడో ఈ మూవీ షూటింగ్ పూర్తి కావాల్సివుండగా అనేక కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus