మనుషులు vs రోబోలు: పోరాటం శ్రుతి మించిందా?

బిగ్‌బాస్‌ ఇంట్లో మసాలా తక్కువైంది అనుకుంటున్నవాళ్లకు పండగ ఈ రోజు దక్కబోతోంది. ఫిజికల్‌ టాస్క్‌లు లేక బోర్‌ కొట్టేసిన జనాలకు ఫుల్‌ మీల్స్‌ పెట్టేలా బిగ్‌బాస్‌ ఈ రోజు టాస్క్‌ సిద్ధం చేశాడు. మనషులు, రోబోల మధ్య పోరాటంగా దీన్ని తీర్చిదిద్దాడు. రోబోలకు ప్రతీకగా సిల్వర్‌ బాల్స్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్‌. దానిని మనుషుల టీమ్‌ పగలకొడితే ఒక రోబో చనిపోతుందని చెప్పాడు. ఇంకేముంది మనుషులవైపు నుంచి దాడి, దాని అడ్డుకోవడానికి రోబోలు చేసే ప్రయత్నాలు… మొత్తంగా టాస్క్‌ రసవత్తరంగా సాగినట్లుంది.

ఇక ఫిజికల్‌ టాస్క్‌ అంటే అరుపులు, లాక్కోవడాలు, పీక్కోవడాలు ఎలాగూ ఉంటాయి. అయితే ఈ సీజన్‌లో ఇలాంటి టాస్క్‌ జరగడం తొలిసారి కాబట్టి ఇంట్లోవాళ్లకు చాలా కొత్తగా అనిపిస్తుంది. పాత పగలు బయటికొస్తాయి, కొత్త పగలు పుట్టుకొస్తాయి. ఫైనల్‌ గెలిచాక చప్పట్లు, కోపాలు సహజం. అయితే గంగవ్వను మధ్యలో పెట్టుకొని ఎలా ఆడారు అనేదే ఆసక్తికరం. బాల్‌ కోసం వచ్చిన మెహబూబ్‌ చొక్కాను దేవీ నాగవల్లి పట్టుకుంది. అది చర్చకు దారి తీసింది. ఇంకా ఇలాంటివి చాలా జరిగినట్లున్నాయి. అవి రాత్రి చూడొచ్చు.

టాస్క్‌ మధ్యలో స్మోక్‌ ఏరియాలో మనుషులు టీమ్‌ కూర్చొని ఉండగా… అక్కడికి ఆరియానా వెళ్లినట్లుంది. అప్పుడే అక్కడకు వచ్చిన సుజాత.. ఆరియానాను ఒక్క ఉదుటున బయటకు బరబరా లాక్కొచ్చింది. చూస్తుంటే ఇది కూడా సీన్‌ క్రియేట్‌ అయ్యే అంశంలా కనిపిస్తోంది. ప్రోమోల జోరు చూస్తుంటే.. ఈ రోజంతా ఈ టాస్కే చూపించేలా ఉన్నాడు. చూద్దాం మనుషులు, రోబోల యుద్ధం శ్రుతిమించిందా? లేక ప్రోమో కట్‌ కోసమే అలా చేశారా అనేది రాత్రి తెలుస్తుంది. టాస్క్‌లో హౌస్‌మేట్స్‌ ముఖాలు చూస్తుంటే ఇంకా నాగార్జున సీరియస్‌ ఎఫెక్ట్‌ పోయినట్లుగా లేదు.


బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus