Hyper Aadi: మెగా బ్రదర్స్ గొప్పదనం చెప్పిన హైపర్ ఆది.. ఏమన్నారంటే?

మెగా హీరోలను అభిమానించే బుల్లితెర కమెడియన్లలో హైపర్ ఆది ముందువరసలో ఉంటరు. చాలా సందర్భాల్లో హైపర్ ఆది చిరంజీవి, పవన్ కళ్యాణ్ లపై తనకు ఉన్న అభిమానాన్ని బహిరంగంగా ప్రదర్శించారు. జోర్దార్ సుజాత యాంకర్ గా జోర్దార్ పార్టీ పేరుతో ప్రసారమవుతున్న ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకు హైపర్ ఆది హాజరు కాగా ఆ ఇంటర్వ్యూ ప్రోమోలో ఆది ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్లెప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు ఆది స్పందిస్తూ మనం నాశనమైపోతే అందరూ అవ్వాలన్న ఫిలాసపీతో అడుగుతున్నారా అని ఆయన కామెంట్లు చేశారు.

తన లవ్ స్టోరీ గురించి హైపర్ ఆది చెబుతూ అందరితో విచ్చలవిడిగా మాట్లాడే నేను నేను ప్రేమించిన అమ్మాయితో ఆరోజు మాట్లాడలేకపోయానని చెప్పుకొచ్చారు. మనం నెగిటివ్ కామెంట్ల వల్ల ఎక్కువగా ఎదుగుతామని ఆది పేర్కొన్నారు. ఆ నెగిటివ్ కామెంట్లు లేకపోతే ఇంతదూరం రాము కదా అని హైపర్ ఆది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రష్మీకి ఫోన్ చేసిన హైపర్ ఆది లోకులు కాకులు ఆంటీని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని కామెంట్లు చేశారు.

అనసూయ జబర్దస్త్ ను వదిలేయడం గురించి, రోజాపై చేస్తున్న విమర్శల గురించి కూడా జోర్దార్ సుజాత ప్రశ్నించారు. అయితే ఫుల్ ఇంటర్వ్యూ విడుదలయ్యాక ఆ ప్రశ్నలకు జవాబులు దొరికే ఛాన్స్ అయితే ఉంది. మీరు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యానా? చిరంజీవి గారికి ఫ్యానా? అనే ప్రశ్నకు హైపర్ ఆది స్పందిస్తూ లీడర్ గా పవన్ కళ్యాణ్ ఇష్టం గ్యాంగ్ లీడర్ చిరంజీవి ఇష్టం అంటూ ఇద్దరిపై అభిమానాన్ని చాటుకుంటున్నారు.

హైపర్ ఆది (Hyper Aadi) ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న షోలతో బిజీగా ఉన్నారు. హైపర్ ఆది తన కామెడీ టైమింగ్ తో అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. హైపర్ ఆదిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus