ఆది జబర్దస్త్ నుంచి విడిపోవడానికి యాంకరే కారణమా?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అయితే ఈయన కొంత కాలం పాటు జబర్దస్త్ కార్యక్రమానికి దూరమై తిరిగి ఈ కార్యక్రమంలో కి వచ్చారు. ఇక ప్రస్తుతం హైపర్ ఆది మరోసారి జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆది ఈ కార్యక్రమానికి ఎందుకు దూరమయ్యారనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది.

ఇక ఆది జబర్దస్త్ కార్యక్రమానికి ఎందుకు దూరమయ్యారనే విషయాన్ని తాజాగా బయటపెట్టారు. ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ఏదో ఒక కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు అనే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ బుల్లితెర నటీనటులు పెద్ద ఎత్తున ఆటపాటలతో సందడి చేశారు.

ఇక హైపర్ ఆది కూడా ఈ కార్యక్రమంలో పెదరాయుడు గెటప్ లో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ రష్మీ హైపర్ ఆదిని ప్రశ్నిస్తూ అసలు విషయం రాబట్టారు.. హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటూ యాంకర్ సౌమ్య రావు ఫోటోతో పాటు మరో ఇద్దరి ఫోటోలను కూడా చూపించారు దీంతో హైపర్ ఆది యాంకర్ సౌమ్యరావు తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి కారణమని హైపర్ ఆది అందరి ముందు ఓపెన్ అయ్యారు.

ఇలా తను జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి సౌమ్యరావు కారణమని చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అయితే ఇంతటితో ఈ ప్రోమో కట్ చేసారు. మరి సౌమ్య ఏ విధంగా హైపర్ ఆది బయటకు రావడానికి కారణమయ్యారనే విషయం తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus