Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ‘బాహుబలి’ థియేటర్లలో సందడి చేస్తుంది. ఈసారి 2 పార్టులు కలిపి ఒక సినిమాగా చేసి ‘బాహుబలి – ది ఎపిక్’ పేరుతో రిలీజ్ చేశారు రాజమౌళి అండ్ టీం. ఈ క్రమంలో ‘బాహుబలి’ అనుభవాలు అన్నీ ప్రభాస్, రానాలతో కలిసి నెమరువేసుకున్నారు రాజమౌళి. ఈ సందర్భంగా పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు వచ్చిన నెగిటివ్ టాక్ ను.. పార్ట్ 2 రిలీజ్ అయినప్పుడు తమ ఎక్స్పీరియన్స్ ను నెమరువేసుకున్నారు. ఈ క్రమంలో ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నిద్ర వచ్చేసింది అంటూ రాజమౌళి పలకడం అందరికీ షాకిచ్చింది.

Rajamouli

రాజమౌళి మాట్లాడుతూ… “‘బాహుబలి 2’ కి గ్రాండ్ ప్రీమియర్స్ పెద్ద లెవల్లో ప్లాన్ చేశారు.కానీ అదే రోజు వినోద్ ఖన్నా గారు చనిపోయారు. అలాంటి టైంలో ప్రీమియర్స్ వేస్తే బాగుండదు అని క్యాన్సిల్ చేశాం. అప్పుడు స్క్రీన్స్ అన్నీ ఎంప్టీ అయ్యాయి. సర్లే మన బాహుబలి టీం 40 మంది ఉన్నారు కదా అని.. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్క్రీన్ కి వెళ్లి సినిమా చూడాలి అనుకున్నాం. కొంతమంది హిందీ చూడడానికి వెళ్లారు.

తర్వాత మేము 5 మందో, 6 మందో ఒక స్క్రీన్లో సినిమా చూద్దామని కూర్చున్నాం. మనం ఫుల్ గా అలిసిపోయి ఉన్నాం. ప్రీమియర్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల.. అప్పటివరకు పెట్టిన ఫ్లెక్సీలు అన్నీ తీసుకెళ్లిపోయారు. ఏదో సినిమా ప్లాప్ అయితే తీసుకుపోతారు కదా. అలా..! సరే అని లోపలి వెళ్లాం. థియేటర్లో ఏసీ వేశారు. సినిమా చూస్తుంటే నిద్ర వచ్చింది. మన శోభు గారు ఏ కామెడీ సీన్ వచ్చినా నవ్వుతారు. ఆయన నవ్వే సౌండ్ మాత్రమే వినిపించింది. నాకు ఏ ఫీలింగ్ రావడం లేదు. బయటకు వచ్చాక శోభు గారు సినిమాకు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

దానికి రమ.. ‘నిజంగానే మీకు సినిమా నచ్చిందా?’ అని అడిగింది. తర్వాత యష్ రాజ్ కి వెళ్లాం. కరణ్, అలియా, రణబీర్ అంతా చూస్తున్నారు. వాళ్ళు సూపర్ సినిమా అని మోసేస్తున్నారు. బాంబేలో అందరూ ఇలానే మాట్లాడతారు అని నేను వాళ్ళ మాట నమ్మలేదు. అయితే హైదరాబాద్ నుండి ఫోన్లు వచ్చాయి. సినిమా దద్దరిల్లిపోయింది అన్నారు. అప్పుడు తిరిగి హైదరాబాద్ వచ్చి ప్రసాద్స్ కి వెళ్లి చూస్తే రిలాక్సేషన్ వచ్చింది” అంటూ తన ఎక్స్పీరియన్స్ చెప్పుకొచ్చాడు.

ప్రెగ్నెన్సీ ఫోటోలు లీక్… క్రిమినల్స్‌తో సమానం మండిపడ్డ స్టార్ హీరోయిన్..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus