జావేద్ భాయ్ జగన్ గురించి ఏమన్నాడంటే…

జగపతిబాబు వట్టి భోళా మనిషి. దీని గురించి పరిశ్రమ వర్గాలలో ఎవరినడిగినా అందరిదీ ఒకేమాట. ఎక్కడైనా దేని గురించైనా ఉన్నదున్నట్టు మాట్లాడతారు. హీరో నుండి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారినపుడు కూడా భుజాల మీద భారం దిగిందని చాలా ఓపెన్ గా చెప్పారు. ప్రస్తుతం తండ్రి, విలన్ వంటి ప్రధాన పాత్రలకు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయిన జగ్గూభాయ్ ‘ఇజం’లో జావేద్ భాయ్ గా కనపడనున్నారు.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న జగపతి పూరి జగన్నాధ్ గురించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. “నాకు జగన్ అంటే చాలా ఇష్టం. అతన్ని ఓ టెక్నీషియన్ గానే కాదు.. ఓ వ్యక్తిగా కూడా బోలెడంత అభిమానిస్తా. తన సినిమాలో నటించమని నాకు ఆఫర్ ఇస్తే.. నేను తనను స్టోరీ కూడా అడగను. అంతగా పూరీ జగన్నాథ్ ను నమ్ముతాను” అని పూరిపై తన ప్రేమను బయటపెట్టారు జగపతి. పూరి కెరీర్ తొలినాళ్లలో జగపతితో చేసిన ‘బాచి’ పరాజయంగా నిలిచిన సంగతి తెలిసిందే. తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus