ఐ బొమ్మ వెబ్ సైట్ పేరుతో మూవీస్ ని పైరసీ చేసి డైరెక్ట్ గా ఆన్లైన్ లో పెడుతూ, సినీ ఇండస్ట్రీ కి కొన్నివేల కోట్ల నష్టాన్ని మిగిల్చాడు ఐ బొమ్మ నిర్వాహకుడు ఐ బొమ్మ రవి (ఇమ్మడి రవి). ఇతని కోసం కొన్ని సంవత్సరాలుగా పోలీసులు వెతుకుతున్న సంగతి తెలిసిందే. నిర్మాతలకు ఎన్నో నిద్ర లేని రాత్రులను, మానసిక, ఆర్ధిక ఒత్తిడికి గురయ్యేలా చేసిన ఈ పైరసీ కింగ్ ఇమ్మడి రవి, ఎట్టకేలకు పోలీసులకి చిక్కాడు. అయితే దీని వెనుక ఇమ్మడి రవి భార్య ఉన్నట్టు, వారిద్దరి మధ్య గొడవలు జరుగుండటంతో విడాకుల కొరకై రవి ఇండియా కు వస్తున్న సమాచారం తన భార్య సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించినట్టు, ఆ సమాచారాన్ని బట్టి పోలీసులు రవిని ట్రాక్ చేసి పట్టుకున్నట్లు ఆన్లైన్ లో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయ్.
అయితే దీంట్లో ఏ మాత్రం నిజం లేదు అంట. ఈ వార్తలకి చెక్ పెడుతూ పోలీసులు క్లారిటీ ఇచ్చారు తన భార్య కి ఈ అరెస్ట్ కి ఏ సంబంధం లేదని , వాళ్లకి 5 సంవత్సరాల క్రితమే విడాకులు అయినట్టు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ విషయంలో తనకు రావాల్సిన కాష్ ట్రాన్స్ఫర్ ఐపీ అడ్రెస్స్ ద్వారా ట్రాక్ చేసి మూసాపేటలోని ఒక అపార్ట్మెంట్ లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఇమ్మడి రవికి 14 రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లోని చంచలగూడ లో జైలు లో ఉంచి విచారిస్తున్నారు. విచారణలో తనకి చాల పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు ప్రపంచ స్థాయిలో తాను అంతా సెట్ చేసుకున్నాడు అని టాక్.