ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 27, 2021 / 07:03 PM IST

“చిలసౌ”తో కథానాయకుడిగా, “అల వైకుంఠపురములో”తో సహాయ నటుడిగా మంచి విజయాలు అందుకున్న సుశాంత్ నటించిన తాజా చిత్రం “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. కొన్ని నిజ సంఘటనల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (ఆగస్టు 27) విడుదలైంది. మరి సుశాంత్ ఈ చిత్రంతో సోలో కథానాయకుడిగా స్థిరపడగలిగాడో లేదో చూద్దాం..!!

కథ: అరుణ్ (సుశాంత్) ఓ సరదా యువకుడు. తన ఆఫీస్ లోనే పని చేసే మీనాక్షి (మీనాక్షి చౌదరి)ని ప్రేమిస్తాడు. నచ్చిన ఉద్యోగం, పక్కనే ప్రేమించిన అమ్మాయి, మంచి ఫ్రెండ్స్. జీవితం చాలా సాఫీగా సాగిపోతుంటుంది. అలాంటి తరుణంలో అరుణ్ జీవితంలోకి వస్తుంది కొత్త బైక్ వస్తుంది, ఆ బైక్ బోలెడన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. అసలు ఒక బైక్ లవ్ స్టోరీకి బ్రేక్ ఎలా వేసింది? అరుణ్ జీవితం ఒక బైక్ వల్ల ఎలా మారింది అనేది “ఇచ్చట వాహనములు నిలుపరాదు” కథాంశం.

నటీనటుల పనితీరు: సుశాంత్ లుక్స్ ఇంప్రూవ్ చేసుకున్నాడు కానీ.. నటన విషయంలో మాత్రం ఇంకా అఆల దగ్గరే ఉండిపోయాడు. ఎమోషన్స్ ఎలివేట్ చేయాల్సిన సన్నివేశాల్లో బ్లాంక్ గా ఉండిపోవడం అనేది సుశాంత్ కి బిగ్గెస్ట్ మైనస్. దాన్ని ఎంత త్వరగా కవర్ చేసుకోగలిగితే అంత మంచిది.హీరోయిన్ మీనాక్షి చౌదరి చక్కని నటనతో అలరించింది. ఆల్రెడీ పలు వెబ్ సిరీస్ లతోపాటు, డ్రామా బ్యాగ్రౌండ్ కూడా ఉన్న మీనాక్షి తెలుగు రాకపోయినా లిప్ సింక్ బాగా మ్యానేజ్ చేసింది. ఆల్రెడీ తెలుగులో మూడు నాలుగు సినిమాలు సైన్ చేసిన మీనాక్షికి ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉంది.

నటుడు వెంకట్ చాన్నాళ్ల తర్వాత మళ్ళీ తెరపై కనిపించాడు. స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నా.. నటుడిగా మాత్రం పర్వాలేదు అనిపించుకున్నాడు. రవివర్మ క్యారెక్టరైజేషన్ బాగుంది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ లు నవ్వించడానికి ప్రయత్నించారు కానీ.. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు దర్శన్ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకొని కథను రాసుకోవడం బాగానే ఉంది కానీ.. కథనాన్ని ఇంకాస్త పకడ్భందీగా రాసుకొని ఉంటే సినిమా హిట్ అయ్యేది. కానీ.. అరకొర సన్నివేశాలు, అవసరం లేని జస్టిఫికేషన్స్, అక్కరకు రాని సందర్భాలు ప్రేక్షకులకు పరీక్ష పెట్టాయి. బడ్జెట్ ఇష్యుస్ వల్లనో లేక ప్రీప్రొడక్షన్ సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వల్లనో ఎగ్జిక్యూషనల్ గా చాలా మిస్టేక్స్ కనిపించాయి. ప్రవీణ్ లక్కరాజు బ్యాగ్రౌండ్ స్కోర్ & సాంగ్స్ బాగున్నాయి. కెమెరా వర్క్ బాగుంది కానీ.. కలర్ కరెక్షన్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది కానీ.. ఆర్ట్ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉండొచ్చు.

విశ్లేషణ: రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసిన అన్ రియలిస్టిక్ ఫిలిం “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. యూత్ ఆడియన్స్ టార్గెట్ గా రూపొందిన ఈ చిత్రంలో వాళ్ళని అలరించే అంశాలు లేకపోవడం పెద్ద మైనస్. అలాగే.. క్లైమాక్స్ ట్విస్ట్ & జస్టిఫికేషన్ కూడా సోసోగా ఉన్నాయి. సో, ఈ కరోనా కాలంలో ఇలాంటి సోసో సినిమాతో ఆడియన్స్ మాస్కులు పెట్టుకొని మరీ థియేటర్లో రెండు గంటలు కూర్చోవడం అనేది కష్టమే.

రేటింగ్: 2/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus