Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Krishna: కృష్ణగారి ఫ్యామిలీ గురించి రామారావు గారి మాటల్లో?

Krishna: కృష్ణగారి ఫ్యామిలీ గురించి రామారావు గారి మాటల్లో?

  • June 29, 2019 / 02:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna: కృష్ణగారి ఫ్యామిలీ గురించి రామారావు గారి మాటల్లో?

ఇటీవల ప్రముఖ సినీ నటి, దర్శకురాలు అయిన విజయ నిర్మల గారు మరణించిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఈమె రెండవ భార్య. వీరిద్దరూ కలిసి అనేక సినిమాల్లో నటించారు. ప్రతీ కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి హాజరయ్యేవారు. ఇప్పటికీ వారెంతో సంతోషంగా గడుపుతున్న తరుణంలో ఇలా విజయనిర్మల గారు దూరమవ్వడం కృష్ణ గారికి చాలా బాదాకరమైన విషయమనే చెప్పాలి. ఇదిలా ఉండగా కృష్ణ గారి మొదటి భార్య ఇందిర గారు ఉండగా విజయ నిర్మల గారిని ఎలా పెళ్ళి చేసుకున్నారు. విజయ నిర్మల గారిని పెళ్ళి చేసుకున్నాక మొదటి భార్యతో ఆయన రిలేషన్ ఎలా ఉండేది.. అనేటువంటి విషయాలు చాలా మందికి తెలీదు. వీటి గురించి ఆసక్తికరమైన విషయాల్ని తెలిపారు సీనియర్ జర్నలిస్ట్.. అలాగే కృష్ణ ఫ్యామిలీని మొదటినుండీ దగ్గరగా ఉంటూ వచ్చిన ఇమంది రామారావు గారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “కృష్ణగారు మొదట ఆయన మరదలు అయిన ఇందిరా దేవి గారిని 1961లో వివాహం చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహం అది. పెళ్ళి తర్వాత ‘సాక్షి’ సినిమా ద్వారా విజయ నిర్మలతో కృష్ణ గారికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 1969లో రహస్యంగా కేవలం నలుగురు సాక్షుల సమక్షంలో… వీరిద్దరూ తిరుపతిలో పెళ్ళి చేసుకున్నారు. కృష్ణ గారిని ఆయన ఇద్దరు భార్యలు చాలా సిన్సియర్ గా ప్రేమించారు. అందుకే ఎలాంటి గొడవలు రాలేదు. విజయ నిర్మల గారిని పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా ఇందిర గారికి ఎలాంటి లోటు రాకుండా కృష్ణ గారు చూసుకున్నారు. రెండవ పెళ్ళైన తర్వాత కూడా ఇందిర గారి ద్వారా కృష్ణ గారు తండ్రి అయ్యారు. తన భర్త పై ఉన్న ప్రేమతో ఆయన ప్రేమను ఇందిర గారు గౌరవించారు.

అందుకే ఆయన రెండవ పెళ్ళి చేసుకున్న సమయంలో గొడవ చేయలేదు. కుటుంబ సభ్యులు కొందరు కృష్ణగారిని తప్పుబట్టే ప్రయత్నం చేయబోయినప్పటికీ.. ‘ఆయన ఏం తప్పు చేయలేదని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు కనుక ఆయన్ను ఎవరూ ఏమనొద్దంటూ’ కృష్ణ గారికి ఇందిరా మద్దతుగా నిలిచిన సందర్బాలు చాలా ఉన్నాయి. మరో వైపు విజయ నిర్మల గారు కూడా కృష్ణ గారిని పెళ్ళి చేసుకున్నా ఆయన మొదటి ఫ్యామిలీకి ఎటువంటి సమస్య రాకుండా.. తనకు మాట రాకుండా జాగ్రత్త పడ్డారు. కృష్ణ గారి కూతుర్లు, కొడుకులతో విజయ నిర్మల చాలా అన్యూన్యంగా ఉండే వారు. ముఖ్యంగా మహేష్ బాబు పై చాలా ఆప్యాయత చూపించేవారు.

కృష్ణ గారి కంటే కూడా మహేష్ మంచి నటుడు అంటూ విజయ నిర్మల గారు చెప్పిన సందర్బాలే ఎక్కువ. ఇక మహేష్ బాబు అందగాడు అంటూ విజయ నిర్మల గారు మహేష్ సినిమా వేడుకల్లో చెప్పేవారు. ‘మహర్షి’ వరకూ కూడా మహేష్ బాబు నటించిన సినిమాలను కృష్ణగారితో కలిసి చూస్తూ వచ్చారు. మహేష్ లాంటి బిడ్డ ఉండాలంటే పూర్వ జన్మ సుకృతం ఉండాలని కూడ చెప్పేవారు. విజయ నిర్మల కొడుకయిన నరేష్ మొదట్లో అస్సలు తల్లి మాట వినేవాడు కాదు. ఇష్టమొచ్చినట్టు వ్యవహరించేవాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని తల్లి చెప్పినట్లుగా విని.. ఆమెకు చివరి వరకు కూడా తోడుగా ఉండి మంచి కొడుకు అనిపించుకున్నాడు. అమ్మపై ప్రేమతో తన పేరులో విజయను చేర్చుకున్నాడు నరేష్. కృష్ణ గారిని కూడా నరేష్ ఎంతో గౌరవించాడు. తండ్రి సమానంగా ప్రతి విషయంలో కూడా చూసుకునే వాడు. కృష్ణ గారు కూడా నరేష్ ను కొడుకులా చూసుకునేవారు” అంటూ కృష్ణ, విజయనిర్మల దంపతుల గురించి ఎవరికీ తెలియని విషయాల్ని చెప్పుకుంటూ వచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Imandhi Ramarao
  • #Mahesh Babu
  • #Naresh
  • #Super star Krishna

Also Read

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

related news

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

trending news

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

23 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

44 mins ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

3 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

4 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

23 hours ago

latest news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

2 hours ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

3 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

4 hours ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

4 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version