Adipurush: ఆ ఒక్క సీక్వెన్స్ కోసం అన్ని రూ.కోట్లు ఖర్చు చేశారా?

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ మరో మూడున్నర నెలల తర్వాత థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ఈ సినిమాలోని సీక్వెన్స్ కోసం ఏకంగా 12 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో సముద్రంలో యుద్ధం జరిగే సన్నివేశాలు ఉంటాయని ఆ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని బోగట్టా.

ప్రస్తుతం ఈ సినిమా గ్రాఫిక్స్ కు సంబంధించి కీలక మార్పులు జరుగుతుండగా శ్రీరామ నవమి కానుకగా ఈ సినిమాకు సంబంధించి మరో టీజర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ప్రభాస్ ఈ సినిమాలో రాముని లుక్ లో కనిపించడానికి తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్నారు. ఈ సినిమాలో సీత పాత్రలో కృతిసనన్ నటించింది. ఖర్చు విషయంలో రాజీ పడకుండా టీ సిరీస్ నిర్మాతలు ఈ సినిమాను నిర్మించారు.

ఆదిపురుష్ రికార్డులు క్రియేట్ చేయకపోయినా ప్రభాస్ కెరీర్ లో మెమెరబుల్ హిట్ గా నిలిస్తే బాగుంటుందని కొంతమంది చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఆది కావ్యం రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఒక్క సీక్వెన్స్ కోసం 12 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే అది మామూలు మొత్తం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో లక్ష్మణుని పాత్రలో సన్నీ సింగ్ నటిస్తుండగా విలన్ రోల్ లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ప్రభాస్ 2023లో రెండు సినిమాలతో 2024లో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రభాస్ స్పిరిట్ సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సినిమా సినిమాకు ప్రభాస్ మార్కెట్ పెరుగుతుండగా ప్రభాస్ దేశంలోనే నంబర్ వన్ హీరో రేంజ్ కు ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus