The Paradise : చాలా ఏళ్ళ తరువాత నాని మూవీలో విలన్ గెటప్ లో సీనియర్ నటుడు..!

హిట్ 3 వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తదుపరి ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. నాని మరోసారి డిఫరెంట్ షేడ్స్ ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన దసరా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. అదే రేంజ్ అంచనాలు ఇప్పుడు ‘ది ప్యారడైజ్’పై ఉన్నాయి.

The Paradise

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోకి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై హైప్‌ను రెట్టింపు చేసింది. కథా పరంగా, మాస్ ఎమోషన్‌తో పాటు తల్లి-కొడుకుల సెంటిమెంట్ కీలకంగా ఉంటుందని ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న టాక్. ఇక అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ చిత్రంలో ఓ సీనియర్ నటుడు పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారట. ఆయన ఎవరో కాదు, నటుడు, రచయితగా తనదైన ముద్ర వేసుకున్న తనికెళ్ల భరణి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కెరీర్ ప్రారంభంలో చేసిన తరహా పాత్రను మళ్లీ ఇప్పుడు చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పడం అభిమానుల్లో చర్చకు దారి తీసింది. దీంతో నాని-తనికెళ్ల భరణి మధ్య సీన్స్ ఎలా ఉండబోతున్నాయో అనే ఆసక్తి మరింత పెరిగింది.

భారీ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారని సమాచారం. రిలీజ్ డేట్‌పై ఇంకా స్పష్టత రాకపోయినా, ‘ది ప్యారడైజ్’ టాలీవుడ్‌లో మరో సంచలనం సృష్టించడం ఖాయమనేలా కనిపిస్తుంది.

The RajaSaab: ‘ది రాజాసాబ్’ విషయంలో ప్రభాస్ బాధ్యత ఎంత వరకు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus