పుణ్య భూమి నా దేశం

  • August 15, 2016 / 04:45 AM IST

కులం ఏదైనా, మతమేదైనా భరత మాతకు అందరూ ఒక్కటే. అందుకే ఆ తల్లికి కష్టం వస్తే అందరూ ఏకం అవుతారు. ద్వేషాలను పక్కన పెట్టి జన్మభూమి కోసం నెత్తురు చిందిస్తారు. ప్రాణాలు అర్పించడాకిని కూడా సిద్ధపడుతారు. ఇలా దేశభక్తిని పెంపొందించే తెలుగు చిత్రాలు అనేకం వచ్చాయి. మనసుని కదిలించి విజయాన్ని అందుకున్నాయి. ఆగస్టు 15 న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వెండి తెరపై దేశభక్తిని కురిపించిన కొన్ని అద్భుత చిత్రాల గురించి..

అల్లూరి సీతారామరాజు

దేశభక్తి అనగానే స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన యోధులు గుర్తుకు వస్తారు. ముఖ్యంగా అడవిలో ఉంటూ తెల్ల దొరలను గడగడలాడించిన మన్యం వీరుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన అల్లూరి సీతారామరాజు సినిమాను ఎప్పటికీ మరిచి పోలేము. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ నటన దేశభక్తిని రగిలిస్తుంది. 1974 లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

భారతీయుడు

https://www.youtube.com/watch?v=pgOhHQGU17Y

సమాజంలోని సమస్యలకు తనదైన శైలిలో పరిష్కార మార్గాలు చూపే దర్శకుడు శంకర్, లంచానికి వ్యతిరేఖంగా తీసిన సినిమా భారతీయుడు. ఇందులో బ్రిటిష్ వాళ్లకు ఎదురెళ్ళిన సేనాపతి పాత్రలో విశ్వనటుడు కమల్ హాసన్ నటన చూస్తే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఆనాటి కాలంలో స్వేచ్ఛ కోసం ఎంతమంది ప్రాణాలు అర్పించారో ఈ చిత్రం కళ్లకు కడుతుంది.

ఖడ్గం

https://www.youtube.com/watch?v=yYG_eYobWtk

స్వాతంత్రం వచ్చినా దేశ మాతకు కష్టాలు తప్పలేదు. కొంతమంది ముష్కరులు మన దేశాన్ని ఆక్రమించుకోవటానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఆటలు కట్టించడానికి పోలీసులు, సైనికులు ఏ విధంగా శ్రమిస్తున్నారో క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ ఖడ్గం సినిమాలో చూపించారు. ఈ సినిమా దేశభక్తి మూవీగా కీర్తి పొందింది. ఇందులోని పాటలు పెద్దలతో పాటుపిల్లల్ని బాగా ఆకట్టుకుంది.

ఆజాద్

ఎంతో మంది ప్రాణాల త్యాగ ఫలం స్వేచ్ఛ భారతం. ఇక్కడ శాంతిని, ఐకమత్యాన్ని పారద్రోలడానికి ఎంతమంది నీచులు ప్రయత్నించినా అడ్డుకుంటామని చాటి చెప్పిన చిత్రం ఆజాద్. ఇందులో కింగ్ నాగార్జున దేశభక్తుడిగా నటించి అలరించారు.

జై

ఎంత పిరికి వాడైనా భారత మాతను కించ పరిస్తే పులిలా మారుతాడని చూపించిన చిత్రం “జై”. ఇందులో అమ్మాయిపై ప్రేమ కంటే స్వరాజ్యం పై ప్రేమ ఎక్కువని దర్శకుడు తేజ చక్కగా చెప్పారు. ఈ చిత్రం యూత్ ని విశేషంగా ఆకట్టుకుంది.

మేజర్ చంద్రకాంత్

దేశ సరిహద్దుల్లోని ద్రోహుల కంటే సొంత దేశాన్నే దోచుకుతినే దుర్మార్గులను అంతమొందించినప్పుడే అసలైన స్వాతంత్రం అంటూ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు మేజర్ చంద్రకాంత్ చిత్రం ద్వారా చెప్పారు. ఇందులో మహా నటుడు నందమూరి తారక రామరావు “పుణ్య భూమి నా దేశం” అనే పాట ద్వారా స్వాతంత్ర సంగ్రామాన్నికళ్లముందుంచారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటించి, నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus