“ఆశ క్యాన్సర్ ఉన్నోడిని కూడా బ్రతికిస్తుంది
భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది”
“జులాయి” మూవీలో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్… నిజజీవితంలో ఎంత జస్టిఫై అయ్యిందో తెలియదు కానీ… మం చుట్టూ క్యాన్సర్తో ఎఫెక్ట్ అయిన కొందరి సెలబ్రెటీలకు మాత్రం పర్ఫెక్ట్ గా సరిపోతుంది. క్యాన్సర్… ఈ మహమ్మారి ఎప్పుడు ఎవరికి షాకిస్తుందో తెలీదు… అప్పుడే పుట్టిన చిన్న పిల్లల నుండీ… వృద్ధ వయసున్న వారికి కూడా ఎప్పుడు వస్తుందనేది.. అంతు చిక్కని ప్రశ్న..! ఆరంభం లో తెలిస్తే పర్వాలేదు కానీ.. ఫైనల్ స్టేజీ లో తెలిస్తే మాత్రం చాలా ప్రమాదం. ఇలా కాన్సర్ తో ఫైట్ చేసి.. గెలిచిన వారిలో సోనియా గాంధీ, సోనాలీ బింద్రే వరకు చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రముఖులలో కొందరు ఫైనల్ స్టేజీ వరకూ వెళ్ళి… ‘ఆశ క్యాన్సర్ ఉన్నోడిని కూడా బ్రతికిస్తుంది’… అని నిరూపించారు. వారెవరెవరో ఓ సారి చూద్దాం రండి :
1. అక్కినేని నాగేశ్వరరావు (లేటు) – ప్రేగు క్యాన్సర్
చివరి రోజుల్లో క్యాన్సర్ ఉందని తెలిసాక కూడా… ఏ.ఎన్.ఆర్ గారు చాలా ఉత్సాహంగా ఉండేవారు. ఒకసారి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ… నాకు క్యాన్సర్ ఉంది కానీ నేను భయపడను… అది నన్నేమీ చేయదు అంటూ.. 90 ఏళ్ళు కాన్ఫిడెంట్ గా గడిపారు. ఆ తరువాత కూడా చాలా యాక్టివ్ గా ‘మనం’ చిత్రం చేసారు.
2. మనీషా కొయిరాలా – రొమ్ము క్యాన్సర్
‘బొంబాయి’, ‘ఒకే ఒక్కడు’ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించిన.. నిన్నటి తరం కధానాయిక మనీషా కొయిరాలా… రొమ్ము క్యాన్సర్ తో పోరాడి గెలిచింది. ‘కీమోథెరఫీ ట్రీట్ మెంట్ తో.. జుట్టు ఓడిపోయినా ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూక్యాన్సర్ ని తిప్పికోట్టింది. చాలా మంది రొమ్ము క్యాన్సర్ తో బాధపడేవారికి ఈమెను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
3. సోనాలి బింద్రే – ‘హై గ్రేడ్ క్యాన్సర్’
టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ సోనాలి బింద్రే. ‘మురారి’ ‘ఖడ్గం’ ‘మన్మథుడు’ ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీని తెలుగు ఆడియెన్స్ ఎప్పటికి మరచిపోలేరు. అయితే కొంత కాలంగా సోనాలి క్యాన్సర్ తో బాధపడిన సంగతి తెలిసిందే. చిక్కిత్స కోసం విదేశాలకు వెళ్ళి ఎంతో ధైర్యంగా క్యాన్సర్ ను ఎదుర్కొన్న సోనాలి మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టింది. ఎన్ని రోజులని రెస్ట్ తీసుకుంటామంటూ మంటూ మళ్ళీ తన పనిని మొదలెట్టింది. చివరికి క్యాన్సర్ తో పోరాడి గెలిచింది.
4. యువరాజ్ సింగ్ – ‘లంగ్ క్యాన్సర్’
అప్పట్లో క్రికెట్ అభిమానులకందరికీ షాకిచ్చిన న్యూస్ ఇది. 2011 లో లంగ్స్ మరియు ట్యూమర్ కాన్సర్ ని ఎదుర్కొంటున్నట్టు.. యువరాజ్ సింగ్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసాడు. ట్రీట్మెంట్ కి ముందు… తరువాత తన ఫిట్నెస్ అండ్.. ఉత్సాహంతో క్యాన్సర్ తో పోరాడి గెలిచి.. తిరిగి ఇండియన్ క్రికెట్ టీంలో జాయిన్ అయ్యాడు.
5. మమతా మోహన్ దాస్ – ‘బ్లడ్ క్యాన్సర్’
సింగర్ గా… హీరోయిన్ గా చాలా మూవీస్ తో మనల్ని అలరించింది మమత. తను 25 వ సంవత్సరంలోకి అడుగు పెట్టగానే… క్యాన్సర్ తో ఫైట్ చేయాల్సి వచ్చింది. ఒక రకంగా కెరీర్ యాక్ట్రెస్ కూడా క్యాన్సర్ తో పోరాడి గెలిచి.. ఇప్పుడు హ్యాపీగా గడుపుతుంది.
6. ఇర్ఫాన్ ఖాన్ – న్యూరోఎండోక్రిన్ క్యాన్సర్
గత సంవత్సరం తన ట్విట్టర్ ద్వారా తాను న్యూరోఎండోక్రిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు ప్రకటించాడు ఇర్ఫాన్. ఇప్పటికి 4 రౌండ్ల ‘కీమోథెరెపీ’ ట్రీట్మెంట్ తీసుకుని… మరో రెండు రౌండ్ల ట్రీట్మెంట్ కోసం ఎదురుచూస్తూ… క్యాన్సర్ తో ఫైట్ చేస్తున్నాడు ఈ విలక్షణ నటుడు.
7. గౌతమి – ‘రొమ్ము క్యాన్సర్’
అప్పటి 1980.. 90 లలో ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా నటించిన గౌతమి గారు కూడా రొమ్ము క్యాన్సర్ తో ఫైట్ చేసారు. 35 సార్లు రేడియోథెరెపీ ట్రీట్మెంట్ తీసుకుని.. గెలిచారు.
8. సోనియా గాంధీ – గర్భాశయ క్యాన్సర్
గాంధీ కుటుంబ కోడలి గా, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా సోనియా గాంధీ మార్క్ అందరికీ తెలిసిందే. ఈమీ కూడా ‘గర్భాశయ క్యాన్సర్’ తో పోరాడి గెలిచారు. ఈ విషయం ఆలస్యంగా తెలిసినా… కరెక్ట్ టైం కి ట్రీట్మెంట్ తీసుకుని నార్మల్ అయ్యారు.
9. అనురాగ్ బసు – బ్లడ్ క్యాన్సర్
రణబీర్ బర్ఫీ మూవీ డైరెక్టర్ అనురాగ్ బసు కూడా 2004 లో బ్లడ్ క్యాన్సర్ కి గురయ్యారు. అప్పటికి 50 మాత్రమే నయమవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పారు డాక్టర్స్. అయినా సరే బలంగా పోరాడి.. గెలిచారు. ఇప్పుడు కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు.
10. తహీరా కశ్యప్ (ఆయుష్మాన్ ఖురానా భార్య )
‘విక్కీ డోనార్’, ‘అందాదున్’, ‘బాధాయ్’ లాంటి చిత్రాలను చేసిన ఆయుష్మాన్ కి తన భార్య తాహీరా ని క్యాన్సర్ రెండోసారి అటాక్ చేసింది. ముందుగా ఓసారి క్యాన్సర్ తో ఫైట్ చేసి బయటపడ్డ .. ఆమెని రెండో సారి కూడా అటాక్ చేయడంతో.. మళ్ళీ దైర్యంగా ఎదుర్కొని కోలుకుంటుంది. తన బట్టతలతో ర్యాంప్ వాక్ చేస్తూ.. అలాగే ఇంస్టాగ్రామ్ లో తన థెరెఫీ తీసుకుంటున్న పిక్స్ షేర్ చేస్తూ… బలంగా నిలబడి కోలుకుంటుంది.
11. రాకేష్ రోషన్ – పొలుసల కణ క్యాన్సర్
తాజాగా రాకేష్ రోషన్ కూడా క్యాన్సర్ కి గురయ్యారు.. చికిత్సకి ముందు మనో దైర్యం కోసం హృతిక్ రోషన్ తన తండ్రిని ‘జిమ్’ చేయిస్తున్న ఫోటోలను కూడా చేసి ధైర్యాన్ని నింపాడు. ఇప్పుడు రాకేష్ రోషన్ కూడా కోలుకుంటున్నారు.
ఇక క్యాన్సర్ పై ‘అవేర్నెస్’ కోసం ప్రయత్నిస్తున్న టాలీవుడ్ ప్రముఖులు.. అలాగే వారికి అండగా.. చేయూతనివ్వాలని ప్రయత్నిస్తున్నారు. వీరిలో కొందరిని చూద్దాం :
1. నందమూరి బాలకృష్ణ
‘బసవతారకం – ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ ద్వారా క్యాన్సర్ పేషెంట్లకు తనవంతు సాయం చేయడమే కాకుండా.. టైం ఉన్నప్పుడల్లా క్యాన్సర్ పై అవగాహన కోసం పలు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాడు మన బాలయ్య.
2.కాజల్ అగర్వాల్ :
కాజల్ అగర్వాల్… టైం ఉన్నప్పుడల్లా క్యాన్సర్ పై అవగాహన కోసం పలు సేవా కార్యక్రమంలో పాల్గొంటుంది ఈ నటి.
3.మంచు లక్ష్మీ :
మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ మంచు కూడా పలు క్యాన్సర్ పై అవగాహన కోసం పలు సేవా కార్యక్రమంలో పాల్గొంది. అంతేకాదు.. తన వంతు ఆర్ధిక సాయం.. అలాగే తనకి తెలిసిన వైద్య నిపుణులతో చేయూతనిస్తుంది.