మెగాస్టార్ చిరంజీవి హీరోగా శోభన హీరోయిన్ గా జెమినీ గణేషన్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం `రుద్రవీణ`. కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘అంజనా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నాగ బాబు నిర్మించారు.చిరంజీవికి ఆ టైములో నమోదైన భీభత్సమైన మాస్ ఇమేజ్ కారణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. కానీ నటుడిగా చిరుని మరో మెట్టు పైకి ఎక్కించడంలో అలాగే ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకోవడంలో ఈ మూవీ సాయపడింది.
ఈ చిత్రంలో ప్రతీ పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రతీ వ్యక్తిని ప్రశ్నించే విధంగా ఉంటుంది. ఈ మూవీ ఓ క్లాసిక్. 1988 వ సంవత్సరంలో మార్చి 4న ఈ మూవీ విడుదలైంది.నేటితో ఈ చిత్రం విడుదలై 34 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఇళయరాజా సంగీతంలో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ మూవీ రిలీజ్ టైములో చాలా వివాదాలు జరిగాయి. ముఖ్యంగా ఈ చిత్రం పై కాపీ ఆరోపణలు ఎన్నో వ్యక్తమయ్యి సంచలనం రేపాయి.
1984లో దర్శకుడు మాదాల రంగారావు తెరకెక్కించిన ‘జనం మనం’ చిత్రం కథని యాజ్ ఇట్ ఈజ్ గా తీసారని అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. అనే సినిమా తీశారు. తన చిత్రాన్ని కాపీ కొట్టి దర్శకుడు బాలచందర్ ‘రుద్రవీణ’ ని తెరకెక్కించాడని … 13 రీళ్ళ వరకు రెండు సినిమాలు ఒకేలా ఉంటాయని ఆయన ఆరోపించారు. ఈ విషయం పై ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి.. ‘రుద్రవీణ’ టీంకి వార్ణింగ్ ఇచ్చారు.
విషయాన్ని కోర్టువరకు తీసుకెళ్ళకుండా చిరంజీవి పై ఉన్న గౌరవం కారణంగానే సామరస్యంగా పరిష్కరించుకుందామని ఆయన తెలియజేసారు. చివరికి ఈ వివాదం ఏమైందనే విషయం ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడున్నట్టు మీడియా ఆరోజుల్లో ఉండి ఉంటే విషయం ఇంకెంత చర్చకు దారి తీసేదో..!
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!