ఎంతో గ్రాండ్ గా జరగాల్సిన బ్రహ్మాస్త్రం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో క్యాన్సిల్ కావడం తారక్ అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసిందనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న తారక్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరగగా బ్రహ్మాస్త్రం మేకర్స్ 2 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో ఈవెంట్ ను ప్లాన్ చేశారు. అయితే పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఈవెంట్ ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పార్క్ హయాత్ లో జరిగిన ప్రెస్ మీట్ లో జక్కన్న మాట్లాడుతూ బ్రహ్మాస్త్రం ఈవెంట్ కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశామని మీరంతా చూస్తే ఎంతో బాగుంటుందని అనుకున్నానని తెలిపారు. బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం టీం చాలా కష్టపడిందని అయితే అనుకున్న విధంగా జరగలేదని రాజమౌళి కామెంట్లు చేశారు. కరణ్ జోహార్ వినాయక పూజ సరిగ్గా చేసుండరని అందుకే ఈ విధంగా జరిగిందని జక్కన్న కామెంట్లు చేశారు.
పోలీస్ అధికారుల నుంచి మొదట అనుమతులు వచ్చాయని అయితే గణేష్ నిమజ్జనాల వల్ల బందోబస్త్ చేయలేమని పోలీసులు చెప్పారని రాజమౌళి వెల్లడించారు. బ్రహ్మాస్త్రం సినిమాలో రణ్ బీర్ అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాడని దానికి తగిన విధంగా ఈవెంట్ లో తారక్ తొడగొడితే ఫైర్ వచ్చేలా ప్లాన్ చేశామని రాజమౌళి వెల్లడించారు. ఇప్పుడు చెయ్యలేకపోయినా బ్రహ్మాస్త్రం సక్సెస్ ఈవెంట్ లో అది తప్పకుండా ఉంటుందని జక్కన్న చెప్పుకొచ్చారు. రాజమౌళి బ్రహ్మాస్త్రం సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
బ్రహ్మాస్త్రం సినిమాను తెలుగులో సమర్పిస్తున్నందుకు రాజమౌళికి కోట్ల రూపాయల ఆదాయం దక్కిందని బోగట్టా. దర్శకునిగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న రాజమౌళి బ్రహ్మాస్త్రం సినిమాతో సమర్పకుడిగా కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. రాజమౌళి మహేష్ కాంబో మూవీ షూటింగ్ 2023 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో మొదలుకానుంది. బ్రహ్మాస్త్రం ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఈ సినిమా గురించి జోరుగా ప్రచారం జరుగుతూ ఆ ప్రచారం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అవుతోంది.
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర