Chatrapati Hindi Remake: వినాయక్ చేసిన పనితో జక్కన్న ఫీలవుతారా?

ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా 2005 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు మాస్ ప్రేక్షకుల్లో ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ను పెంచింది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు, తల్లీకొడుకు సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విడుదలై 16 సంవత్సరాలు అయినా టీవీలో ఈ సినిమాకు మంచి రేటింగ్స్ వస్తున్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వినాయక్ డైరెక్షన్ లో ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తైంది. హిందీ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా స్క్రిప్ట్ లో ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, వీవీ వినాయక్ కీలక మార్పులు చేశారని సమాచారం. సినిమాలోని సెంటిమెంట్ సీన్లను తగ్గించి యాక్షన్ సీన్లకు వినాయక్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

హీరో, విలన్ మధ్య వచ్చే సన్నివేశాల విషయంలో హిందీలో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో సక్సెస్ అందుకుంటారేమో చూడాల్సి ఉంది. రాజమౌళి టేకింగ్ వల్ల తెలుగులో హిట్టైన ఈ సినిమా హిందీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో వినాయక్ కు సినిమా ఆఫర్లు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. పలువురు టాలీవుడ్ డైరెక్టర్లు ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటగా రాజమౌళికి బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నా ఆ ఆఫర్లను జక్కన్న సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో రాజమౌళి బాలీవుడ్ పై దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది. హిందీ ఛత్రపతిలో చేసిన మార్పుల వల్ల జక్కన్న ఫీలవుతారేమో అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus