యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్ లో తెరకెక్కిన ఏకైక సినిమా ఊసరవెల్లి కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వక్కంతం వంశీ కథతో తెరకెక్కిన ఈ సినిమా 2011 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీన థియేటర్లలో విడుదల కాగా 27.6 కోట్ల రూపాయల కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమాలో టోని అనే పాత్రలో తారక్ నటించారు.
ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా ఉన్న (Oosaravelli) ఈ సినిమా సెకండాఫ్ లోని కొన్ని మైనస్ ల వల్ల బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు విడుదలై ఉంటే కమర్షియల్ గా సక్సెస్ సాధించేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఫ్లాష్ బ్యాక్ మరింత బెటర్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో చాలామంది ఇప్పటికీ ఈ సినిమాను ఇష్టపడతారు.
ఊసరవెల్లి సినిమాలో తారక్ లుక్, హెయిర్ స్టైల్ కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలోని నిహారిక నిహారిక, నేనంటే నాకు చాలానే ఇష్టం సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఊసరవెల్లి సినిమాను రీరిలీజ్ చేస్తే బాగుంటుందని కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. రాబోయే రోజుల్లో ఈ సినిమా రీ రిలీజ్ దిశగా అడుగులు పడతాయేమో చూడాల్సి ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా దేవర సినిమా మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. దేవర సినిమా బడ్జెట్ లెక్కలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా విడుదల కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లాన్స్ అన్నీ వేరే లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది.