ఆర్ఆర్ఆర్ మూవీ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి కొమ్మ ఉయ్యాల పాట కూడా ఒక విధంగా కారణమనే సంగతి తెలిసిందే. సినిమాలో మల్లి అనే గిరిజన చిన్నారి పాడే కొమ్మ ఉయ్యాల పాట పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటను పాడిన ఒరిజినల్ సింగర్ ఎవరనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. కొమ్మ ఉయ్యాల పాటను అద్భుతంగా ఆలపించిన బాలగాయని పేరు ప్రకృతి రెడ్డి.
ప్రకృతి రెడ్డి వయస్సు 12 సంవత్సరాలు కాగా పలు టీవీ షోలలో పాల్గొనడం ద్వారా ఈ బాలగాయని పాపులారిటీని సంపాదించుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి ప్రాంతానికి చెందిన ప్రకృతి రెడ్డి 2010 సంవత్సరం జులై 21వ తేదీన జన్మించారు. బాల్యం నుంచే ప్రకృతికి సంగీతం అంటే ఇష్టం కాగా తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించడంతో ప్రకృతి సంప్రదాయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సంగీత కార్యక్రమాలలో పాల్గొంటూ ఈ బాల గాయని సత్తా చాటుతున్నారు.
పాడుతా తీయగా, బోల్ బేబీ బోల్, పలు రియాలిటీ షోలలో పాల్గొని తన పాటలతో ప్రకృతి మెప్పించారు. తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఉండటంతో తెలుగు, కన్నడ భాషలతో పాటు ప్రకృతి ఇతర భాషల్లో కూడా పాటలు పాడటం నేర్చుకున్నారు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పేరుతో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ఒక ప్రోగ్రామ్ ప్రసారమైంది. ఆ ప్రోగ్రామ్ లో కీర్తనలు మధురంగా ఆలపించిన ప్రకృతి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి దృష్టిలో పడ్డారు.
ప్రముఖ సంగీత దర్శకులను, పాటల రచయితలను తన గాత్రంతో ప్రకృతి రెడ్డి మంత్రముగ్ధులయ్యేలా చేశారు. ప్రకృతి పాడిన పాటలను విని ఎస్పీ బాలు, శంకర్ మహదేవన్ సైతం ఫిదా అయ్యారు. కొమ్మ ఉయ్యాల పాట వల్ల ప్రకృతి పేరు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో మారుమ్రోగుతోంది. ప్రకృతి మరెన్నో సినిమా ఆఫర్లను అందుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?