‘కేజీయఫ్’ సినిమాలతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు యశ్. అందులో రాఖీ భాయ్‌గా యశ్ నటన, లుక్, ఎలివేషన్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే రెండు ‘కేజీయఫ్’ల తర్వాత కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. దీంతో అతని ఫ్యాన్స్ చాలా రోజులుగా సినిమా ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. రాఖీ భాయ్ కొత్త సినిమా ప్రకటించారు. ఓ మలయాళీ దర్శకురాలు ఈ సినిమాను హ్యాండిల్ చేయబోతున్నారు. దీంతో ఎవరీ కెప్టెన్ అంటూ అందరూ తెగ వెతికేస్తున్నారు.
‘కేజీయఫ్ 2’ వచ్చి ఏడాది గడిచినా యశ్ ఇంకా కొత్త ప్రాజెక్టుని అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా.. కానీ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పాన్ ఇండియా రేంజిలో ఈ సినిమాను రూపొందిస్తారట. గీతూ మోహన్ దాస్ అసలు పేరు గాయత్రి దాస్. మలయాళ పరిశ్రమలో ప్రముఖ నటి.
1986లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె… ‘ఒన్ను ముత్తల్ పూజయం వరే’ అనే సినిమాతో కేరళ స్టేట్ అవార్డు సంపాదించింది. హీరోయిన్‌గానూ మంచి సినిమాలే చేశారు. అయితే 2009లో ప్రొడక్షన్ హౌస్ పెట్టి షార్ట్ ఫిలిం తీశారు. దానికి మూడు ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. 12వ తరగతి పాఠ్య పుస్తకంలో ఈ సినిమాను ఓ పాఠంగా పెట్టాఉ కూడా.
2014లో ‘లయర్స్ డైస్’ అనే హిందీ సినిమా తీస్తే.. దానికి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. 2019లో గీతూ మోహన్ దాస్ తీసిన ‘మూతోన్’ అనే సినిమా పెద్ద విజయం సాధించింది. దీని తెలుగు వెర్షన్ ‘మూతన్’ ఆహాలో అందుబాటులో ఉంది. ఇప్పుడు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ నటిస్తాడు అని అంటున్నారు. చూడాలి ఎలాంటి కథతో వస్తారో?