బాలయ్య టాక్‌ షోపై ఇంట్రెస్టింగ్‌ రూమర్‌

Advertisement

నందమూరి బాలకృష్ణ ఓ టాక్‌ షో చేస్తున్నాడు?… ఈ అనౌన్స్‌మెంట్‌తో ఓటీటీ రంగంలో, టాలీవుడ్‌లో ఓ అలజడి రేగింది. ‘ఏంటీ మన బాలయ్య ఓటీటీకి వస్తున్నాడా? అందులో టాక్‌ షోనా’ అని అందరూ వావ్‌ అనుకున్నారు. ఆ జోష్‌ను మరింత పెంచే రూమర్‌ ఒకటి ఇప్పుడు బయటికొచ్చింది. ఇదిగానీ జరిగితే… ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ని దబిడి దిబిడి అయ్యి… రప్ఫాడించేస్తారు. ఇప్పటికే అర్థమైపోయుంటుంది మేం ఏం చెప్పాలనుకున్నామో. ‘ది బాప్‌ ఆఫ్‌ ఆల్‌ టాక్‌ షోస్‌’ అంటూ ఆ మధ్య పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

త్వరలో దీనికి సంబంధించిన ప్రోమోను లాంచ్‌ చేస్తారని తెలుస్తోంది. దసరా సందర్భంగానే ఈ వేడుక ఉంటుంది అంటున్నారు కానీ… ఇంకా క్లారిటీ లేదు. అంతేకాదు ఈ షో తొలి ఎపిసోడ్‌ చాలా ఘనంగా ప్రారంభించాలని ‘ఆహా’ టీమ్‌ ప్లాన్‌ చేస్తోందట. దీని కోసం మెగాస్టార్‌ను రంగంలోకి దింపుతోందట. అవును మీరు చదివింది కరెక్టే. తొలి ఎపిసోడ్‌ అతిథి చిరంజీవి అని సమాచారం. బాలయ్య, చిరంజీవిని ఒక ఫ్రేమ్‌లో చూస్తే… ఇద్దరి అభిమానులకు పండగే అని చెప్పాలి.

అలాంటిది ఏకంగా ఒక షోలో సుమారు ఓ అరగంట చూడటం అంటే ఆ ఆనందానికి అవధులు ఉండవు. మరి ఈ రూమర్‌ నిజమవుతుందా? చిరంజీవి, బాలయ్య ఆ షోలో కనిపిస్తారా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus