Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » 2018 లో అందరూ ఎదురుచూస్తున్న చిత్రాలు

2018 లో అందరూ ఎదురుచూస్తున్న చిత్రాలు

  • December 18, 2017 / 01:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2018 లో అందరూ ఎదురుచూస్తున్న చిత్రాలు

తెలుగు చిత్ర పరిశ్రమకు 2017 బాగా కలిసి వచ్చింది. చిరంజీవి ఖైదీ నంబర్ 150 తో మొదలైన విజయ పరంపర మొన్నటి అర్జున్ రెడ్డి వరకు కొనసాగింది. అఖిల్.. హలో అంటూ ఈ ఏడాదికి మంచి హిట్ తో గుడ్ బై చెప్పనున్నారు. అలాగే వచ్చే ఏడాది కూడా భారీ ప్రాజెక్ట్ లు సినీ జనాలను ఊరిస్తున్నాయి. 2018 లో ఆసక్తి రేకిస్తున్న తెలుగు సినిమాలపై ఫోకస్….

అజ్ఞాతవాసి Agnathavasiజల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడో సినిమా అజ్ఞాతవాసి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పవన్ నటిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మానియేల్, కీర్తి సురేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. జనవరి 10 న విడుదలకానున్న సినిమా అనేక రికార్డులను బద్దలు కొట్టనుంది.

జై సింహ Jai Simhaసంక్రాంతి మొనగాడుగా పేరు దక్కించున్న బాలకృష్ణ ఈ ఏడాది గౌతమి పుత్ర శాతకర్ణితో సూపర్ హిట్ అందుకున్నారు. 2018 లో జై సింహా గా రాబోతున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ జనవరి 11 న థియేటర్లో సందడి చేయనుంది.

భాగమతి Bhagamatiబాహుబలి సినిమాల తర్వాత అనుష్క చేస్తున్న ఏకైన చిత్రం భాగమతి. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలోగత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయి అంచనాలను పెంచేసింది. ఈ మూవీ జనవరి 26 రిలీజ్ అవుతోంది.

మహానటి Mahanatiతెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతవరకు మహానటి సావిత్రి పేరు నిలిచిపోతుంది. ఆమె జీవితం ఆధారంగా ప్రస్తుతం సినిమా రూపుదిద్దుకోనుంది. నాగ్ అశ్విన్ సావిత్రి నిజ జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం మార్చి 28 న మూడు భాషల్లో రిలీజ్ కానుంది.

రంగస్థలం Rangasthalamధృవ వంటి హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “రంగస్థలం” సినిమా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అదరగొట్టింది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మార్చి 30 న రిలీజ్ కానుంది.

భరత్ అనే నేను Bharat Ane nenuశ్రీమంతుడు.. ఇండస్ట్రీ హిట్. ఆ కాంబినేషన్లో మూవీ అంటే భారీ అంచనాలు ఉంటాయి. అందుకే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను సినిమాపై క్రేజ్ నెలకొని ఉంది. ఇందులో తొలి సారి మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 27 న థియేటర్లోకి రానుంది.

నా పేరు సూర్య Na Peru Suryaకిక్, రేసు గుర్రం, టెంపర్ వంటి హిట్ చిత్రాలకి కథ అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా నాపేరు సూర్య. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇందులో సోల్జర్ గా నటిస్తున్నారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాహో Saahoయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న సాహో సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయనుంది. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం దీపావళికి కలక్షన్ల మతాబులు వెలిగించనుంది.

తొలిప్రేమ Toli Premaమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా మూవీ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో తొలిప్రేమ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో హీరోయిన్ గా శీఖన్నా నటిస్తోంది. రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది.

నాగార్జున, వర్మ మూవీ Nagarjuna, RGV28 సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించిన శివ కాంబినేషన్లో ఓ మూవీ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ముంబై లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ ఉన్నా.. ప్రేమ లేదు, పాటలు లేవు అని వర్మ ముందుగానే చెప్పి మరింత ఆసక్తిని కలిగించారు. ఈ చిత్రం మార్చి 11 థియేటర్లోకి రానుంది.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ NTR, Trivikramవరుసగా హిట్స్ తో దూసుకుపోతోన్న ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మించనున్న ఈ మూవీపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2018 Movies
  • #Agnyaathavaasi
  • #Bhagamathi Movie
  • #Bharath ane nenu
  • #Jai Simha

Also Read

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

related news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

trending news

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

7 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

14 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

15 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

16 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

16 hours ago

latest news

దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

11 hours ago
Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

11 hours ago
Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

12 hours ago
Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

12 hours ago
8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version