బిగ్ బాస్ షో సీజన్7 విజేత ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. గత కొంతకాలంగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అవుతారని జరిగిన ప్రచారం నిజమైంది. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో విజేతగా నిలవడంతో అతని కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పల్లవి ప్రశాంత్ రాజకీయాల్లోకి వస్తారని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. వైరల్ అవుతున్న వార్తలు తన దృష్టికి రావడంతో పల్లవి ప్రశాంత్ తండ్రి స్పందించి తన కొడుకు రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదని అన్నారు.
నా కొడుకు ఇంత దూరం రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు. నా కొడుకుకు సినిమాలు అంటే ప్రాణమని సినీ నటుడిగా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని పల్లవి ప్రశాంత్ తండ్రి కామెంట్లు చేశారు. పల్లవి ప్రశాంత్ తాను బిగ్ బాస్ విజేతగా నిలవడంలో శివాజీ పాత్ర ఎంతో ఉందని వెల్లడించారు. శివాజీ ధైర్యం చెప్పడం వల్లే తాను విజేతగా నిలిచానని అన్నారు.
పల్లవి ప్రశాంత్ చేసిన కామెంట్లు ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. బిగ్ బాస్ ఫేమ్ ను సరిగ్గా వినియోగించుకుంటే పల్లవి ప్రశాంత్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పల్లవి ప్రశాంత్ ను డైరెక్ట్ గా కలవడానికి బెంగళూరు, ఇతర ప్రాంతాల నుంచి ఆయన అభిమానులు సొంతూరుకు వస్తున్నట్టు తెలుస్తోంది.
పల్లవి ప్రశాంత్ కు (Pallavi Prashanth) సినిమాలలో అవకాశాలు వస్తే ఆయన కెరీర్ పుంజుకునే అవకాశాలు ఉంటాయి. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుని ముందడుగులు వేస్తే పల్లవి ప్రశాంత్ కు కెరీర్ పరంగా తిరుగుండదు. బిగ్ బాస్ షో విన్నర్ గా నిలవడం పల్లవి ప్రశాంత్ కెరీర్ ను మలుపు తిప్పుతుందని చెప్పవచ్చు.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!