Prabhas New Look: ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వనున్న ప్రభాస్!

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ఆదిపురుష్ సినిమా ఒకటి కాగా ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముని పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ పౌరాణిక పాత్రలో కనిపిస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశమంతటా ప్రభాస్ మ్యానియా కొనసాగుతుండగా ప్త్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ టీజర్ యూట్యూబ్ లో క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీఇన్నీ కావు. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ శ్రీరాముని పాత్రలో నటిస్తున్న ఆదిపురుష్ వచ్చే ఏడాది ఆగష్టు 11వ తేదీన రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వీ.ఎఫ్.ఎక్స్ పనులు మొదలయ్యాయి. ఈ సినిమాలో సీత పాత్రలో కృతిసనన్ నటిస్తుండగా రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. రామాయణం పౌరాణిక గాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ అబ్బురపరిచేలా ఉండనుందని సమాచారం. బాహుబలితో పోలిస్తే ఈ సినిమాకు మూడు రెట్లు ఎక్కువగా విఎఫ్ఎక్స్ వర్క్ ఉండనుందని తెలుస్తోంది.

ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఆరు నెలల కంటే ఎక్కువ సమయం కేటాయించడం గమనార్హం. మరోవైపు సంక్రాంతికి రిలీజ్ కానున్న రాధేశ్యామ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. హస్త రేఖలను చూసి భవిష్యత్తును చెప్పే నిపుణుడిగా ప్రభాస్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ప్రభాస్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాల్సి ఉంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus