సినిమా ఇండస్ట్రీలోకి వారసులు రావడం సర్వసాధారణం ఇప్పటికే అన్ని భాష చిత్రాలలో కూడా వారసులు హీరోలుగా హీరోయిన్లుగా కొనసాగుతూ బిజీగా ఉన్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో వారసురాలు కంటే వారసులు ఎక్కువగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ విషయానికి వస్తే ఈయన కుమారుడు మోక్షజ్ఞ త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక బాలకృష్ణ కుమార్తెల విషయానికి వస్తే ఈయనకు బ్రాహ్మిని తేజస్విని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి మనకు తెలుసు ఇక వీరిద్దరు కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
చూడటానికి ఎంతో అందం అభినయం కలిగినటువంటి వీరిద్దరూ తప్పకుండా ఇండస్ట్రీలోకి వస్తారని హీరోయిన్స్ గా కొనసాగుతారని అప్పట్లో దర్శక నిర్మాతలు భావించారు. ఈ క్రమంలోనే కొంతమంది డైరెక్టర్లు బాలకృష్ణ వద్దకు వెళ్లి తమ పెద్ద కుమార్తె బ్రాహ్మణి ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేయాలని కోరారట. దర్శక నిర్మాతలు బాలయ్యను అడగడంతో బాలకృష్ణ తన కుమార్తె ఇండస్ట్రీ లోకి రావడానికి ఒప్పుకోలేదు ఇలా బాలకృష్ణ ఒప్పుకోకపోవడంతోనే తన కుమార్తె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి కానీ బాలకృష్ణ ఒప్పుకోకపోవడానికి కూడా కారణం ఉందని తెలుస్తుంది.
సినీ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి (Nara Brahmani) బ్రాహ్మణికి సినిమాలు అంటే మొదటి నుంచి కూడా పెద్దగా ఆసక్తి లేదట. ఇలా తనకు ఆసక్తి లేదని తెలిసిన బాలయ్య ఆమెను ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ కూడా ప్రోత్సహించలేదు. తనకు వ్యాపార రంగంలో చాలా ఆసక్తి ఉండడంతో తనని అటువైపే ప్రోత్సహించారని అందుకే ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో మాత్రం సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా గుర్తింపు పొందారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె హెరిటేజ్ సంస్థలతో పాటు బసవతారకం హాస్పిటల్ బాధ్యతలను కూడా తీసుకున్నారు.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!