టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకదీరుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఒకరు. అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇక ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డును కూడా తెచ్చి పెట్టినటువంటి ఘనత రాజమౌళికి ఉందని చెప్పాలి. ఇక ఈయన చిన్నప్పటి నుంచి కూడా సినీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి పెరగటం వల్ల సినిమాలపై ఎంతో ఆసక్తి ఉంది. ఇలా కెరియర్ మొదట్లో సీరియల్స్ డైరెక్టర్ గా పని చేసినటువంటి రాజమౌళి మొదటిసారి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
ఇక ఈ సినిమాతో తొలి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఇప్పటివరకు అపజయం అనేది తన లిస్టులో లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇక రాజమౌళి రమ అనే మహిళను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె కూడా రాజమౌళి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. తాజాగా రాజమౌళి పెళ్లికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తన తండ్రికి ఒక హీరోయిన్ తో పెళ్లి చేయాలని భావించారట.
ఈ క్రమంలోనే రాజమౌళి (Rajamouli) అన్నయ్య సంగీత దర్శకుడు ఎమ్ ఎం కీరవాణితో కలిసి ఆ హీరోయిన్ వద్దకు వెళ్లి రాజమౌళితో పెళ్లి గురించి మాట్లాడాలని భావించారట అయితే విజయేంద్రప్రసాద్ ఒకసారి రాజమౌళిని అడిగితే బాగుంటుందని తనకి ఫోన్ చేయగా ఆయన అసలు నాకు హీరోయిన్ తో పెళ్లి వద్దు అంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇకపోతే రాజమౌళి అప్పటికే వేరొక వ్యక్తితో పెళ్లి జరిగి ఒక కుమారుడికి జన్మనిచ్చి భర్త నుంచి విడాకులు తీసుకున్నటువంటి రమాను తీసుకువచ్చి తన తండ్రికి పరిచయం చేసి తనని ప్రేమిస్తున్నానని చెప్పారట.
దీంతో ఒక్కసారిగా విజయేంద్ర ప్రసాద్ షాక్ అయ్యారని తెలుస్తుంది. అయితే తన కొడుకుకు ఇష్టం కావడంతో రమా గారితోనే రాజమౌళి పెళ్లి చేశారట అలా కాకుండా హీరోయిన్ తో పెళ్లి కనుక చేసి ఉంటే బహుశా ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ కావడంతో ఈపాటికి విడాకులు తీసుకొని విడిపోయే వారేమో రమాని పెళ్లి చేసుకోవడంతోనే వీరిద్దరూ ఆదర్శ దంపతులుగా ఉన్నారని ఆమె కూడా తన సినిమాల సక్సెస్ కు కారణమయ్యారని పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!