Rakshita Reddy: రక్షిత రెడ్డి కోసం హీరోల నుంచి ఇన్ని ప్రపోజల్స్ వచ్చాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు శర్వానంద్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వచ్చినా అవకాశాలు అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ నటుడిగా తనని తాను నిరూపించుకుంటున్నారు. ఇకపోతే సినిమాలలో నటిస్తూ హీరోగా బిజీగా ఉన్నటువంటి శర్వానంద్ కొద్ది రోజుల క్రితం రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఉన్నత చదువులు చదివి విదేశాలలో ఉద్యోగం చేసినటువంటి రక్షిత రెడ్డి కుటుంబానికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. ఇలా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ భారీగా ఉన్న అమ్మాయితో శర్వానంద్ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. శర్వానంద్ ఉదయపూర్ లో అది కొద్దిమంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం చేసుకున్నారు. అనంతరం హైదరాబాదులో ఈయన పెద్ద ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేసి టాలీవుడ్ సెలబ్రిటీలు అందరినీ కూడా ఆహ్వానించారు.

ఇలా కొత్త జీవితంలోకి అడుగుపెట్టినటువంటి శర్వానంద్ ప్రస్తుతం తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే తాజాగా శర్వానంద్ భార్య రక్షిత రెడ్డి గురించి ఒక వార్త వైరల్ గా మారింది. రక్షిత రెడ్డి మంచి చదువులు చదువుకొని ఉన్నత కుటుంబంలో జన్మించిన అమ్మాయి అలాగే ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్ ఫ్యామిలీ కావడంతో ఈమెను తమ ఇంటి కోడలుగా చేసుకోవడం కోసం ఎంతోమంది స్టార్ హీరోలు ప్రయత్నం చేశారట

ఇలా హీరోలు తమ ప్రపోజల్ కూడా రక్షిత కోసం పంపించగా రక్షిత (Rakshita Reddy) మాత్రం వారందరినీ రిజెక్ట్ చేస్తూ వచ్చారు. ఈ విధంగా కొంతమంది హీరోలు రక్షితను తమ ఫ్యామిలీ మెంబర్గా చేసుకోవాలని ప్రయత్నించిన రక్షిత మాత్రం ఒప్పుకోలేదట కానీ శర్వానంద్ పేరు తన ప్రపోజల్ రాగానే పెళ్లికి అంగీకరించింది అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus