కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయి అంటే.. ‘కంటెంట్ బాగుంటే ఆడతాయి’ అని అంతా అంటారు. మెజారిటీ పర్సెంటేజ్ చూసుకుంటే.. ఇది సరైన సమాధానమే..! కానీ పూర్తిస్థాయిలో కాదు. ‘రిలీజ్ కి ముందు పలానా సినిమా హిట్ అవుతుంది’ అని ఎవరైనా చెప్పినా.. అది కచ్చితంగా జరుగుద్ది అని చెప్పలేం. తర్వాత ఆడియన్స్ డెసిషన్ ని కూడా తప్పు అనలేం. సినిమా బ్యూటీ అలాంటిది.
గొప్ప గొప్ప హీరోలు, డైరెక్టర్లు, కూడా తమ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది రిలీజ్ కి ముందు అంచనా వేసుకోలేకపోయారు. కానీ ఆడవు అని జనాల మీదకు వదిలేసిన సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు అలాంటి సినిమా గురించే మనం చెప్పుకోబోతున్నాం. వివరాల్లోకి వెళితే… 2008వ సంవత్సరం జూన్ 13న ‘దశావతారం’ (Dasavathaaram) అనే సినిమా రిలీజ్ అయ్యింది. కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను కె.ఎస్.రవికుమార్ (K. S. Ravikumar) డైరెక్ట్ చేశారు. ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలిం.
ఈ సినిమాలో కమల్ హాసన్ (Kamal Haasan) ఏకంగా 10 విభిన్నమైన పాత్రలు పోషించారు. కమల్ హాసన్ (Kamal Haasan) ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ అని ఎందుకు అంటారు? అనే ప్రశ్న ఎవరైనా అడిగితే… ఆన్సర్ చెప్పకుండా సింపుల్ గా ఈ సినిమా చూడమంటే సరిపోతుంది.ఇది అతిశయోక్తి కాదు. నిజం. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు.. కథతో సంబంధం లేకుండా మిగిలిన నటీనటుల గురించి ఆలోచించకుండా.. కేవలం హీరో యాక్టింగ్ తో ట్రావెల్ అయ్యారు జనాలు. సినిమాలో హీరో ఆయనే, విలన్ ఆయనే..! ఇంకా చెప్పుకోవాలంటే చాలా రకాల పాత్రలు ఉన్నాయి.
అన్ని పాత్రల్లోనూ కమల్ (Kamal Haasan) ఇన్వాల్వ్ అయిపోయి నటించారు. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. చాలా మంది కథేంటో అర్ధం కాలేదు అన్నారు. స్క్రీన్ ప్లే కూడా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అయినప్పటికీ క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయ్యింది. సునామీ వచ్చే ఎపిసోడ్ ఏదైతే ఉందో.. దాని పిక్చరైజేషన్ కానీ, దాంతో ఇచ్చిన మెసేజ్ కానీ బాగుంటుంది. కానీ చాలా మందికి దీని గురించి కూడా అర్థం కాలేదు. కానీ క్లైమాక్స్ ను అయితే బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేశారు. టాక్ తో సంబంధం లేకుండా సినిమాకి భారీ వసూళ్లు వచ్చాయి.