Akhanda: ‘అఖంఢ’లో బాలయ్యకు మరో లుక్‌ ఉందట

  • May 7, 2021 / 02:40 PM IST

ఇప్పుడు ‘అఖండ’ కానీ… చాలా రోజులు #BB3గా కొనసాగింది బాలయ్య సినిమా. ఆ రోజుల్లో సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువమంది ప్రస్తావించిన అంశం ‘అఘోరా’. దీంతో చాలామంది ‘అవునా.. బాలయ్య అలాంటి పాత్రలో కనిపిస్తాడా?’ అంటూ అవాక్కయ్యారు. అభిమానులు మాత్రం ‘మా బాలయ్య గ్రేట్‌… డేరింగ్‌ స్టెప్‌ వేస్తున్నాడు.. ఇలాంటి పాత్ర చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి’ అంటూ రకరకాలుగా అనుకున్నారు. కొందరైతే బాలయ్య ‘అలాంటి పాత్ర చేయకపోతే బెటర్‌’ అనుకున్నారు. అయితే ఇటీవల వచ్చిన టీజర్‌లో బాలయ్య కొత్త గెటప్‌లో కనిపించాడు.

దీంతో అఘోరా పాత్ర ఇక ఉండదు అని అందరూ అనుకున్నారు. అయితే అఘోరా పాత్ర ఇంకా డిస్కషన్స్‌లో ఉందట. బాలయ్య – బోయపాటి సినిమా అంటే బాలయ్య ఒక సర్‌ప్రైజ్‌ గెటప్‌లో కనిపించడం పక్కా. ‘సింహా’, ‘లెజెండ్‌’లో అలా కనిపించి మెప్పించాడు నందమూరి అందగాడు. ఇప్పుడు ‘అఖండ’లో రెండు పాత్రలనూ రిలీజ్‌ చేసేశారు. ఇక దాచిన పాత్ర ఏంటి అనే మాట ఇప్పుడు టాలీవుడ్‌లో తిరుగుతోంది. దీంతో ఇప్పుడు కొత్త పుకారు ఒకటి బయటికొచ్చింది. ‘అఖండ’లో ముందు వచ్చిన రూమర్స్‌ నిజమవుతాయంట. అంటే అఘోరా పాత్ర ఉంటుందట. సెకండాఫ్‌లో వస్తుందట.

‘అఘోరా’ పాత్ర గురించి తొలుత చర్చలు జరిగినప్పుడు బాలయ్య ఓకే అనుకున్నారట. అయితే ఎందుకులే అనుకున్నారో, ఇంకేమో కానీ ఇప్పుడు వద్దులే అనుకున్నారట. దీంతో ఆ గెటప్‌ ఉండదని జనాలు ఫిక్స్‌ అయిపోయారు. అయితే డేరింగ్‌ స్టెప్‌ వేయడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఇప్పుడు మళ్లీ అఘోరా పాత్రకు ఓకే చెప్పేశారట. త్వరలో ఈ సీన్స్‌ క్లోజ్డ్‌ సెట్‌లో చిత్రీకరిస్తారని సమాచారం. అయితే ఈ అఘోరా… మిగిలిన అఘోరాలకు కాస్త భిన్నంగా ఉంటాడట.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus