బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్పాడు. ఇప్పుడు ఎవరి గేమ్ ఏంటో క్లియర్ గా అర్ధం అవుతుందని, అసలు సిసలైన గేమ్ మజా వస్తుందని అన్నాడు. అన్నట్లుగానే మార్నింగ్ అభిజిత్ మాట్లాడిన మాటలు, అలాగే మోనాల్ బాధ, సోహైల్ వ్యధ, అన్నీ సీక్రెట్ రూమ్ లో నుంచే చూశాడు. అయితే, ఇక్కడ గేమ్ అంతా చూస్తాడా.. లేదా అతనికి సంబంధించిన మాటలు ఎవరతై మాట్లాడతాడో అవి మాత్రమే చూస్తాడా అనేది ఆసక్తికరం.
ఇక్కడ అభిజిత్ అఖిల్ ని ఉద్దేశ్యించి కొన్ని మాటలు మాట్లాడాడు. ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నారు తీరాచూస్తే ఎలిమినేట్ చేసేశారు ఏంటి అని, అలాగే కెప్టెన్సీ టాస్క్ కూడా సరిగ్గా ఆడలేదు అని అనవసంరగా పోగొట్టుకున్నారని అన్నాడు. అసలు అఖిల్ ఏం గేమ్ ఆడుతున్నావ్ అంటూ అడిగేస్తాను వస్తే మళ్లీ అన్నాడు అభిజిత్. ఇవన్నీ అఖిల్ వింటున్నా సరే నో ప్రాబ్లమ్ అని కూడా అన్నాడు. అంటే అభిజిత్ అఖిల్ సీక్రెట్ రూమ్ కి వెళ్లినట్లుగా కనిపెట్టేశాడా అనే అనుమానం కూడా కలుగుతోంది.
అంతేకాదు, అఖిల్ కూడా అభిజిత్ అన్న మాటలు వింటూ వాటికి సెటైర్లు వేశాడు. నిజంగా అభిజిత్ అన్న మాటలు పాజిటివ్ గా అఖిల్ కి కనిపించడం లేదా ? సరిగ్గా బుర్రకి ఎక్కట్లేదా.. అనేది కూడా పాయింట్. ఇప్పుడు అఖిల్ సీక్రెట్ రూమ్ లో గేమ్ ని ఎలా అర్ధం చేస్కుంటాడు. మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత గేమ్ ని ఎలా ఆడతాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.
Most Recommended Video
ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!