ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధి అన్ని విధాలు చేయూతను అందిస్తాం.. ఏపీకి సినిమా పరిశ్రమను తీసుకొస్తాం.. ఈ రెండు రకాల స్టేట్‌మెంట్‌లు గత కొన్నేళ్లుగా ఇటు తెలుగు సినిమా పరిశ్రమలో, అటువైపు టాలీవుడ్‌లో వింటూనే ఉన్నాం. అయితే ఈ మాటలు ప్రారంభించినప్పుడు ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ పరిస్థితి ఎలా ఉందో? ఇప్పటికీ అలానే ఉంది. ఎందుకో కానీ ఏపీకి తెలుగు సినిమా వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా అది ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కో, లేక సక్సెస్ మీట్‌కో వెళ్తున్నారు. దీనిపై ఇటీవల సీనియర్ నిర్మాత అంబికా కృష్ణ లేవనెత్తిన ఓ అంశం టాలీవుడ్‌లో చర్చకు దారితీస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే అక్కడ షూటింగులు నిర్వహించేందుకు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ముందుకు రావాలని అంబికా కృష్ణ సూచించారు. పెద్ద హీరోలు తమ సినిమాలకు కనీసం రెండు షెడ్యూళ్లైనా ఏపీలో షూటింగ్ చేయాలని ఆయన కోరారు. దీంతో ఇప్పుడు ఆయన మాటల్ని వినేది ఎవరు? స్పందించేది ఎవరు డిస్కషన్ మొదలైంది. సీనియర్ నిర్మాతగా ఆయన ప్రస్తావించిన అంశాలు కచ్చితంగా చర్చిచందగ్గవే.
ఆయన చెప్పినట్లు ఇప్పుడు షూటింగ్ విధానం మారకపోతే.. ఏపీకి సినిమా పరిశ్రమ రావడం, అభివృద్ధి చెందడం లాంటి ఎన్నేళ్లయినా జరగవు. ఆ మాటకొస్తే కొంతమంది హీరోలు ఏపీలో షూటింగ్‌లు చేశారు. పేర్లు చెబితే యాంటీ ఫ్యాన్స్ గోల చేస్తారు కానీ.. కొంతమంది తక్కువమందే ఉన్నారు. ఇప్పుడు అంబికా కృష్ణ రియాక్ట్ అయిన నేపథ్యంలో నిర్మాతలు కూడా ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. అయితే ఇది అంత ఈజీ కాదు. తెలుగు సినిమా ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్‌కి అలవాటు పడింది. అప్పట్లో ఏఎన్నార్ మద్రాసు నుండి హైదరాబాద్‌కి వచ్చినట్లు ఇప్పుడు ఎవరో ఒకరు అలా చేయాలి. మరి ఈ డేరింగ్ స్టెప్ వేసే ఆ ‘హీరో’ ఎవరు అనేది చూడాలి.